YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాట తప్పిన జగన్

మాట తప్పిన జగన్

మాట తప్పిన జగన్
విజయవాడ డిసెంబర్ 20
అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ...అమరావతి వికేంద్రీకరణ చేసి అమరావతి ని చంపేయాలి అని జగన్ చూస్తున్నాడు. 10 శాతం ఖర్చు చేస్తే అమరావతి లో భవనాలు పూర్తి అయిపోతాయి. జగన్ దేశ సార్వభౌమాధికారం ప్రదర్శిస్తున్నాడని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలోని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర మంత్రులతో శంకుస్థాపన గావించబడిన రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఉందని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ గతంలో రాజధాని అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పి నేడు మాట తప్పాడని అన్నారు. మూడు రాజధానుల విషయంలో సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్ ఆ దేశ అధ్యక్షుడు ఆదేశ పార్లమెంటులో చెప్పిన మాటలను విన్నారా అని ప్రశ్నించారు.అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ అమరావతి వికేంద్రీకరణ చేస్తూ జగన్ చేసిన ప్రకటనతో ఏపీ తుగ్లక్ ఏమి చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదని జగన్ సుందోపసుందులు అయిన మంత్రులలో ఒకరు రాజధాని మార్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని.. మరొకరు సీఎం చెప్పిందే ఫైనలా అని..మరో మంత్రి పెద్దిరెడ్డి మూడు చోట్ల కాకపోతే 30 చోట్ల రాజధాని పెట్టుకుంటాం రైతుల భూములు వెనక్కి చేస్తామంటూ ఇష్టారీతిన ప్రకటనలు చేస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి సూచనతో విజయసాయి రెడ్డి సారథ్యంలో వైసీపీ నేతలు ఆరు వేల ఎకరాలను విశాఖపట్నం లో కొనుగోలు చేశారని గత మూడు నెలల్లో జరిగిన భూ లావాదేవీలపై సిబిఐ విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. అప్పుడు అసలైన ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందని అన్నారు. అమరావతిలో 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చిన చిన్న సన్నకారు రైతుల త్యాగం ఉందని వారికి అన్యాయం జరిగి వారి ప్రయోజనాలకు భంగం కలిగితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని దేవినేని హెచ్చరించారు.

Related Posts