YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని నిర్మాణంలో ప్రగతి సాధించని చంద్రబాబు పాలన  తెలుగుదేశం ప్రతిపక్ష హోదా కాపాడుకోవాలి నెల్లూరు డిసెంబర్ 20

రాజధాని నిర్మాణంలో ప్రగతి సాధించని చంద్రబాబు పాలన  తెలుగుదేశం ప్రతిపక్ష హోదా కాపాడుకోవాలి నెల్లూరు డిసెంబర్ 20

రాజధాని నిర్మాణంలో ప్రగతి సాధించని చంద్రబాబు పాలన
 తెలుగుదేశం ప్రతిపక్ష హోదా కాపాడుకోవాలి
నెల్లూరు డిసెంబర్ 20
గడచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ నేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాజధాని నిర్మాణంలో ప్రగతి సాధించలేదని, తాత్కాలిక రాజధాని పేరిట వేల కోట్లు స్వాహా చేయడం జరిగిందని వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. స్థానిక అంత పేట ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు లక్షలాది కోట్ల రూపాయలను దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారికంగా తెలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు 54 వేల ఎకరాలను పేద ప్రజల నుండి అక్రమంగా ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట తీసుకున్నట్లు ఆ ప్రాంత రైతులు తెలియజేస్తున్నా రని చెప్పారు. 5,600 కోట్లతో తాత్కాలిక రాజధాని భవనాలను నిర్మించి నిర్మాణంలో భాగంగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన తప్పులను వైకాపా పాలనలో సరిదిద్దుకో వలసి వచ్చిందని తెలిపారు. 2019 ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్లు ఊహల్లో తేలి ఆడుతున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తుందన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నేడు నిర్వహిస్తున్న నియంతృత్వ ధోరణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆయనపై ముందు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసే సమయంలో ప్రజలు , వ్యవస్థలు, సమస్యలతో చర్చించి వారి సమ్మతి మేరకే నూతన రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి రాజధాని ఏర్పాటు చేసిన చంద్రబాబు అటువంటి వ్యవహారం ఏమి అవసరమే లేనట్టు ఏకపక్షంగా రాజధాని నిర్మాణం చేపట్టడం సమంజసం కాదన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలోని మూడు ముఖ్య జిల్లాలలో మూడు ప్రాంతాలలో మూడు రాజ్యాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ లో పెట్టారని ఆ అంశం ప్రస్తుతం జరుగుతుందన్నారు. ప్రజా అభిప్రాయాల మేరకు రాజధాని ఎక్కడ నిర్మించాలన్నది తెలియజేయాల్సి ఉంటుంది అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష హోదా కాపాడుకునేందుకు, రాష్ట్ర అభివృద్ధికి పరిపాలనాదక్షతతో చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆనం రంగ మయూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts