YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు  కనిపించవా    

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు  కనిపించవా    

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు  కనిపించవా         
ఎమ్మిగనూరు డిసెంబర్ 20 
ఎమ్మిగనూరు పట్టణంలో సంక్షేమ హాస్టల్స్ లో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం(పి.డి.ఎస్.యు)జిల్లా ఉపాధ్యక్షులు మహేంద్ర బాబు డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక ఎం.ఆర్.ఓ  కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ జ్యోతిర్మయి గారికి వినతి పత్రం ఇవ్వడం  జరిగింది. ఈ సందర్భంగా   మహేంద్ర బాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్ రెడ్డి గారు సంక్షేమ హాస్టల్స్ సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చాక అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు ను కన్నెత్తి కూడా చూడకుండా వారి సమస్యలు గాలికొదిలేశారని అన్నారు ఆరునెలలు అవుతున్న కాస్మొటిక్ చార్జీలు విడుదల చెయ్యకుండా విద్యార్థులు పై వివక్షతకు గురిచేయడం జరుగుతుంది అలాగే ధరలకు అనుగుణంగా మేస్ చార్జీలు పెంచి పౌష్టిక ఆహారం అందిస్తామన్నారు మేస్ చార్జీలు ఎక్కడ  పెంచారో చెప్పాలన్నారు నాన్నగారి కాలన్ని  తలపించే విధంగా పరిపాలనా ఉంటుంది అని ప్రగల్భాలు పలికి నేడు విద్య వ్యవస్థ పడుతున్న బాధలను గాలికొదిలేసి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.హాస్టల్ సొంత భవనాలు ఏర్పాటు చేసి రెగ్యులర్ వార్డెన్ నియమించాలి. నేటికీ హాస్టల్ విద్యార్థులు అర్ధాకలితో కడుపులు మడ్చుకొని చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి కొంత మంది విద్యార్థులు హాస్టల్స్ వదిలి వెళ్లిపోతున్నారు అలాగే హాస్టల్స్ ల్లో సరైన మెనూ కానీ, మౌలిక వసతులు కానీ లేవన్నారు కావునా విద్యార్థులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

Related Posts