తిరుప్పావై ఆరవ పాశురం
*6 వ పాశురము :*
*పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్*
*వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో*
*పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు*
*కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి*
*వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై*
*ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం*
*మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం*
*ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్*
తాత్పర్యము:
భగవదనుభవము క్రోత్తదవుట వల్ల ఈ వ్రతము గురించి తెలియక తానొక్కత్తె తన ఇంటిలో పడుకొని బయటకు రాకుండా వున్న ఒక అమ్మాయిని లేపుచున్నారు.
ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కలకలాడుచున్నవి.ఆ పక్షులుకు నాయకుడైన గరుత్మంతునకు స్వామీ యగు శ్రీ మహా విష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయము అయినది అని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ద్వని వినుటలేదా ! ఓ పిల్లా ! లే!. మేము ఎవరు లేపగా లేచామన్న అని కలుగవచ్చు .
పుతనస్తనములందుండు విషమునారగించినవాడును . అసిరావేశము గలిగి చంప నుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడునట్లు, పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి యగునట్లు చేసినవాడును, క్షీర సాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షచింతనతో యొగనిద్ర సమరియున్న జగత్కారణభుతుడగు ఆ సర్వెస్వరుని తమ హృదయముల పదిలపరచుక్ని మెల్లగా లేచ్చున్న మునులును యోగులను హరి -హరి -హరి అనుచున్నప్పుడు వెల్లిన పెద్ద శబ్ధము మా హృదయములలో చొచ్చి, చల్లబరచి , మమ్ములను మేల్కొల్పినది. నీవునూ లేచి రా .
*అవతారిక :*
ధనుర్మాస వ్రతంలో చేయవలసినది, పొందవలసినది, దానికి తగు యోగ్యత మొదలైనవాటిని గురించి మొదటి ఐదు పాశురాలలోను వివరించింది గోదా తల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గోనజేసింది. ఈ మొదటి ఐదు పాశురాలను వ్రతానికి మొదటి దశగా (అభిముఖ్య దశ) చెపుతారు.
ఇక 6 నుంచి 15 వరకు రెండవ దశ, అనగా ఆశ్రయణదశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము, సాక్షాత్కరము కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి. ఆచార్య కృపకావలెనంటే వారిని సమాశ్రయించాలి. భాగవదనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భవగద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కావున యీ పది పాశురాలలో గోదా తల్లి భగవదనుభవాన్ని పొందిన పదిమంది గోపికలను మాతో కలిసిరండని, మీఅనుభావాన్ని మాకూ పంచండనీ, ఆ భగవదానందాన్ని మీరొక్కరే అనుభవించరాదనీ, అందరికీ పంచవలెనని గోపికారూవులు, సదాచార్యులైన ఆళ్వారు రూపాలను మేలుకొలుపుతోంది గోదాతల్లి. వ్రతంలో అనుభవం లేని ఒక గోపి కనులేపుతోందీ పాశురంలో.
*(అఠాణారాగము - ఆదితాళము)*
ప. చూడవె! సఖియరో! ఓ చిన్నదాన!
పడక వీడవె! పక్షులెగిరే కనవే!
చూడవే! సఖియరొ!
అ.ప. గడి వెడలిన గుడి శంఖ నాదములు
వడి బిలువగ వినలేదే! లేవవె! చూడవె! సఖియరొ!
1 చ. స్తన విషమును, పూతన, శకటాదుల
ప్రాణమ్ముల నవలీల హరించిన
పన్నగ శయసుని జగన్నాధుని
మనసున నిలిపి ధ్యానింపరాగదే!
చూడవె! సఖియరో
2. చ. మునులు యోగులును మెల్లనె లేచి
ధ్యానమగ్నులై 'హరి హరి' యన - నది
ఘనరవమై మా మనసులను జేరి
తనువు పులకింప నిదుర లేపినది
చూడవె! సఖియరో!