YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

వికేంద్రీకరణతో అభివృద్ది రాదు

వికేంద్రీకరణతో అభివృద్ది రాదు

వికేంద్రీకరణతో అభివృద్ది రాదు
విజయవాడ డిసెంబర్ 21
రాష్ట్రంలో ఎం జరుగుంతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటే బాగుంటుంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కమిటీ నివేదికలు ఉన్నాయి. తెదేపాను గందరగోళంలో నెట్టడానికి జగన్ ప్రకటన ఉంది తప్ప ప్రజల కు ఉపయోగపడేలా లేదని భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలా లేక అధికార వికేంద్రీకరణ జరగాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. హై కోర్టును కర్నూల్ లో పెట్టమంటే నాడు చంద్రబాబు వినలేదు. జగన్మోహన్ రెడ్డి,  చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను తమ జాగీర్ అనుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా అడ్డుకుంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని భాజపా నాడే చెప్పింది, దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. హై కోర్ట్ రావడం వలన కొత్తగా ఏమి వస్తుంది కర్నూలు కి మహా అయితే నాలుగు జిరాక్స్ మిషన్లు నాలుగు న్యాయవాదుల భవనాలు తప్ప. జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. మిగిలిన రాష్ట్రాన్ని ముంచేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నాలుగు వేల ఎకరాలు భు కుంభకోణం జరిగింది అని వైకాపా చెప్తుంది,కుంభకోణం జరిగి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతున్నారని అన్నారు. రైతులు ఇష్టమో కష్టమో తమ పొలాలు త్యాగం చేసి రాజధానికి ఇచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధిక ఎమ్మెల్యేలు మీరే గెలిచారు,మీకు పట్టం కడితే అమరావతి రైతులను మోసం చేస్తారా అని ప్రశ్నించారు. రాయలసీమలో పంటలు పండక ఏడుస్తుంటే ,అమరావతి రైతులను మరోలా ఎడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి వికేంద్రీకరిస్తారా, లేక పరిపాలన వికేంద్రీకరిస్తారా ? రాజాకీయంగా తెదేపాను ఇబ్బంది పెట్టడానికే పరిపాలన వికేంద్రీకరణ అనే వైకాపా ఎత్తుగడల కనిపిస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవు. హై కోర్ట్ ఒకప్రాంతంలో బెంచ్ ఒక ప్రాంతంలో ఉండాలని ఎవరైనా చెప్తారు దానికి జియన్ రావు కమిటీ అవసరంలేదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అభిప్రాయాన్నైనా జియన్ రావు కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. జియన్ రావు కమిటీ చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదు. ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖ లో ,మంత్రులు అమరావతిలో ,విమానాల్లో తరలిస్తారా వారినని అయన అడిగారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి అంతే కాని పరిపాలన వికేంద్రీకరణ చేయడం వలన అభివృద్ధి జరగదు. అమరావతిలో సీడెడ్ కాపిటల్ ఉండాలి, మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి.  అమరవతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలి అది భాజపా స్పష్టమైన విధానం నిర్ణయమని అన్నారు.

Related Posts