దిశ చట్టం ఓ చరిత్రాత్మకం
నెల్లూరు డిసెంబర్ 21
నెల్లూరు నగరాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నాం. మరో నెల రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టే బోతున్నామని ఏపీ జలవనరుల శాఖామంత్రి అనీల్ కుమార్ అన్నారు. శనివారం అయన నగరంలో పర్యగించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక వసతులు ఏర్పాటు కోసం రూ.20 కోట్ల నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. దిశ చట్టం ఓ చరిత్రాత్మకం. నెల్లూరులో దేవాలయ భూములను పరిరక్షిస్తాం. ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు నేతలు కలిపి పరిపాలిస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారని అన్నారు.