YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

 ప్రైవేట్ వాహానాలకు కాసుల వర్షం

 ప్రైవేట్ వాహానాలకు కాసుల వర్షం

 ప్రైవేట్ వాహానాలకు కాసుల వర్షం
హైద్రాబాద్, డిసెంబర్ 21,
ఆర్టిసిని గట్టేక్కించేందుకు ఓవైపు సీఎం కెసిఆర్ పకడ్బందీగా చర్యలు చేపడుతుంటే… మరోవైపు కొందరు డిపోస్థాయి అధికారుల తీరు అందుకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంటే…కొందరు అధికారులు ఆదాయానికి గండికొట్టే చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ నష్టాల్లో ఉన్న ఆర్‌టిసిని పెంచిన చార్జీలు.. బస్సుల రద్దు లాభాల బాట పట్టిస్తుందని ఆశించినా… ఇష్టానుసారంగా బస్సుల రద్దు నష్టమే కలిగిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెంచిన చార్జీలతో గ్రేటర్‌లో రోజూ అదనంగా రూ50 లక్షలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొందరు అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.గ్రేటర్ పరిధిలోని 29 డిపోలలో 3580 బస్సులు ఉండగా, మరమ్మతుల కారణంగా 1200పైగా బస్సులు రోడ్డెక్కని పరిస్థితి. నగరంలో నిత్యం 42వేల రూట్లలలో బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న రద్దుతో మరో 900 పైగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో పదివేలకు పైగా ట్రిప్పులను రద్దు చేశారు. అయితే, రూట్ సర్వే చేసి తక్కువ ఆదాయం వచ్చే రూట్లలో బస్సులను రద్దుచేయాల్సివున్నా…..ఆదాయం ఎక్కువగా వచ్చే రూట్లలో కూడా బస్సులను రద్దుచేయడం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలోనే ఉదయం వేళలలో భారీగా బస్సులను తగ్గించి… రాత్రి వేళల్లో పెంచడం కూడా ఆదాయానికి గండిపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా జరుగుతున్న తీరుతో వచ్చే ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొన్నది.ఈ నిర్ణయం ప్రైవేటు వాహనదారులకు కాసులవర్షం కురిపిస్తోంది. ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు రూట్ సర్వేలు నిర్వహించి….లాభాలు వచ్చే ఏర్పాట్లు చేయకుండా కొందరి అనాలోచిత చర్యలతో మరిన్ని ఇబ్బందులు పడే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బస్సుల రద్దుతో సుమారు 4వేల మంది ఆర్‌టిసి కార్మికులు డ్యూటీలు చేయని పరిస్థితి నెలకొంది. వీరికి ప్రత్యామ్నాయ విధులను నిర్వహించినా… దీని ద్వారా సంస్థకు పెద్దగా ప్రయోజనం లేకుండా ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించి గ్రేటర్‌లో రూట్ సర్వే నిర్వహించి ఆదాయం వచ్చే రూట్లలోనే బస్సులను నడిపేవిధంగా చర్యలు తీసుకుంటేనే ఆర్‌టిసికి ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.

Related Posts