అది జగన్ మోహన్ రెడ్డి కమిటీ
విజయవాడ డిసెంబర్ 21, :
ఇది జి ఎన్ రావు కమిటీ కాదు. జగన్ మోహన్ కమిటీ. రైతుల ఆందోళన చూసి జిఎన్ రావు కూడా దొడ్డి దారిన పారిపోయారు. జగన్ పుట్టిన రోజు కానుకగా ప్రజల గుండెల మీద తన్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. 29 గ్రామాల ప్రజలు రోడ్డు మీద ఉంటే జగన్ పుట్టిన రోజు పండగలు చేసుకుంటున్నాడు. మంత్రులకు బుర్ర ఉందా? సీఆర్డీఏ యాక్ట్ సరిగ్గా చదువుకోండి. తుళ్లూరు లో వరదలు వస్తాయా...? జి ఎన్ రావు కమిటీ కి బుర్ర ఉందా అని ప్రశ్నించారు. విశాఖ లో చాలా భూములు విజయసాయిరెడ్డి కబ్జా చేసాడు. 1000 ఎకరాల ల్యాండ్స్ లో ఫ్లాట్స్ వేస్తున్నారు. సిరిపురం ఏరియాలో భూములు చేతులు మారాయి. లంకెల పాలెం ఏరియాలో దళారీలును పెట్టి వేల ఎకరాలు కొనుగోలు చేస్తున్నారు. వాల్తేర్ క్లబ్ దగ్గర లో 13 ఎకరాలు కబ్జా చేసాడు సాయిరెడ్డి. సీబీఐ విచారణ కి డిమాండ్ చేస్తే జగన్ సమాధానం చెప్పడు. భూ లావాదేవీల పై విజయసాయిరెడ్డి నోరు మెదపడు. భోగాపురం నుండి మధురవాడ వరకు 6000 ఎకరాలు వైసీపీ నేతలు ల్యాండ్స్ ఉన్నాయని అయన అన్నారు. విశాఖ లో కమర్షియల్ కాంప్లెక్స్ భూములు పులివెందుల పంచాయితీ చేసి కాజేసింది వాస్తవం కాదా ? విశాఖ లో ఏ పాపం ఎక్కడ ఉందో అధికారి ప్రవీణ్ ప్రకాష్ కి తెలుసు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి వైఎస్ పెరు పెట్టటానికి విశాఖ రాజధాని అంటూ తెరలేపారు. ప్రభుత్వం మెడలు వంచి రాజధాని ని కాపాడుకుంటామని అయన అన్నారు