YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

వరంగల్ ఆర్టీసీలో రాయితీ బస్‌పాస్‌ల కుంభకోణం

వరంగల్ ఆర్టీసీలో రాయితీ బస్‌పాస్‌ల కుంభకోణం

వరంగల్ ఆర్టీసీలో రాయితీ బస్‌పాస్‌ల కుంభకోణం
వరంగల్ డిసెంబర్ 21  :
జిల్లా ఆర్టీసీలో రాయితీ బస్‌పాస్‌ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బస్ పాసుల జారీలో టెక్నాలజీని అడ్డు పెట్టుకొని కొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఒకే సెల్ నెంబర్‌పై 5,600 బస్‌పాస్‌లను జారీ అయ్యాయి. కాగా ఈ భారీ కుంభకోణం వెనుక ఆర్టీసీ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కుంభకోణంపై ఆర్.ఎం శ్రీధర్ హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.

Related Posts