తమిళనాడు ఇళ్లు ముట్టడి
చెన్నై డిసెంబర్ 21:
;: పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా అన్నాడీఎంకే ఎంపీ ఓటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన 3 వేల మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. దేశంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ చట్టానికి మద్దతుగా అన్నాడీఎంకే ఎంపీలు ఓటు వేయడాన్ని నిరసిస్తూ మనిదనేయ మక్కల్ కట్చి తరఫున పట్టణంబాక్కంలో ఆందోళన చేపట్టారు. ముందుగా ఆందోళనకారులు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంటిని ముట్టడించేందుకు పట్టనంబాక్కం నుంచి ర్యాలీగా బయల్దేరారు. మార్గమధ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, అనుమతి లేకుండా ఆందోళన చేపట్టడంతో పాటు రెచ్చగొట్టే విధంగా మనిదనేయ మక్కల్ కట్చి కార్యకర్తలు వ్యవహరించారంటూ 3 వేల మందిపై పట్టణంబాక్కం పోలీసులు కేసు నమోదుచేశారు.