YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
 నెల్లూరు డిసెంబర్ 21 
జిల్లాలో వైయస్సార్ రైతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక కస్తూరి దేవి కళాక్షేత్రంలో శనివారం జిల్లా  చేనేత జౌళి శాఖ మరియు యు.ఎస్.ఏ నేత అభ్యుదయ సేవ సమితి ఆధ్వర్యంలో వైయస్సార్ ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర పరి పాలన సాగిస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి సేవలను కొనియాడారు. ఈ క్రమంలో భాగంగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారందరికీ సంవత్సరానికి 24 వేల ఆర్థిక సహాయం రాష్ట్రవ్యాప్తంగా అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు చెందిన 6852 మంది నేతన్నలకు వైయస్సార్ నేతన్న నేస్తం పథకం లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధాని ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుంది అనే ఈ అంశంపై రాష్ట్ర ప్రజలతో చర్చిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నీరు కారుస్తూ టిడిపి నాయకులు రాష్ట్రానికి మూడు రాజధానుల అనే విధంగా హేళన చేయడం తగదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడి శ్రీనివాసరావు మరియు కార్యాలయ సిబ్బంది తోపాటు చేనేత అభ్యుదయ సేవ సమితి జిల్లా నేతలు పాల్గొన్నారు.

Related Posts