YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరుకు మూడు కొత్త రిజర్వాయర్లు

చిత్తూరుకు మూడు కొత్త రిజర్వాయర్లు

చిత్తూరుకు మూడు కొత్త రిజర్వాయర్లు
చిత్తూరు డిసెంబర్ 21
చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 15టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా మూడు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వేకోసం సీఎం అంగీకరించారని వెల్లడించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కటి ఐదేసి టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేలా నేటిగుట్టపల్లి, ఉప్పరపల్లి, పూతలపట్టు వద్ద మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వే కోసం సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెప్పారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో  వైద్య చికిత్సల వల్ల నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న 48 మంది బాధితులకు తిరుపతిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 58.70 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.రాష్ట్రంలో 46 వేల కోట్ల రూపాయలతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుచేసి, ప్రతి ఇంటికీ తాగునీరు అందించనున్నామని. తెలంగాణలో ఇప్పటికే వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుతో ప్రతి ఇంటికీతాగునీరు అందిస్తున్నారని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా అనుకున్నంత నీరు అందడం లేదని, అక్రమంగా నీటిని మళ్లిస్తుండడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని మంత్రి తెలిపారు.  
త్వరలోనే స్థానిక ఎన్నికలు రానున్నాయని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.సచివాలయాల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు.25 లక్షల ఇండ్లను ఇవ్వనున్నామని తెలిపారు. గతంలో జిల్లాలో నరేగా పనుల్లో అవకతవకలు జరిగా యని, వీటిపై విచారణ పూర్తి చేసిన తర్వాత బిల్లులు చెల్లించే యోచనలో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.

Related Posts