YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీజేపీకి చలిజ్వరం తెప్పించేలా ఉన్న జార్ఖండ్ ఎగ్జిట్ పోల్

బీజేపీకి చలిజ్వరం తెప్పించేలా ఉన్న జార్ఖండ్ ఎగ్జిట్ పోల్

బీజేపీకి చలిజ్వరం తెప్పించేలా ఉన్న జార్ఖండ్ ఎగ్జిట్ పోల్
రాయ్ పూర్  డిసెంబర్ 21 :
తాజాగా జరిగిన జార్ఖండ్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదల అయ్యాయి. ఇవి బీజేపీకి చలిజ్వరం తెప్పించేలా ఉన్నాయి.20 ఏళ్ల క్రితం... బీహార్ నుంచి వేరుపడిన జార్ఖండ్ లో ఇప్పటికే అత్యధిక సీఎంలు మారిపోయారు. తాజాగా అక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 ఎమ్మెల్యే మద్దతు అవసరం కానుంది. ఐదు దశల పోలింగ్ ఈరోజుతో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఇవి బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఎన్నికలు దేశంలో ఇదొక రాష్ట్రంలోనే జరుగుతుండటంతో జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముఖ్యనేతలు అందరూ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ప్రచారం చేసినా వారి పట్ల ప్రజలు ఆసక్తిగా లేరని తేలిపోయింది.ఇండియాటుడే:-  బీజేపీ - 22-32 - జేఎంఎం కాంగ్రెస్ : 38-50..టైమ్స్ నౌ -  బీజేపీ- 28 - జేఎంఎం కాంగ్రెస్- 44.

Related Posts