పాక్షిక కేతు గ్రస్థ సూర్యగ్రహణం 26.12.2019 నాడు అనగా మార్గశిర, బహుళ అమావాస్య ధనురాశిలో మూలానక్షత్రంలో సంభవిస్తుంది. కాబట్టి ధనురాశివారు శాంతి చేయించుకోవాలి. అలాగే, వీరు గ్రహణ సూర్యుడిని ప్రత్యక్ష వీక్షణ చేయుట మంచిది కాదు.
గ్రహణ స్పర్శ కాలం ఉదయం 8.11 నిమిషాలకు,
గ్రహణ మధ్యకాలం ఉదయం 9.38 నిమిషాలకు,
గ్రహణ మోక్ష కాలం పగలు 11.20 నిమిషాలకు.
గ్రహణం ముందు మధ్యలో మరియు విడుపు స్నానం చేసి ఇంటియందే ఉండి జపం చేయుట ఉత్తమం.
గర్భిణీ స్త్రీలు బయటకి రావడం గ్రహణ వీక్షణ చేయడం మంచిదికాదు. అలాగే, ధనురాశి వారు కూడాను. గ్రహణ సమయంలో ఏదైనా దానం, జపం చేసిన మంచి ఫలితం ఉంటుంది. జన్మ నక్షత్ర, రాశ్యాదులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది.
*తుల, కర్కాటక, మీన, కుంభ వారికి శుభ ఫలం కలుగును.*
*మేష, మిధున, వృశ్చిక, సింహం వారికి మిశ్రమ లేదా మధ్యమ ఫలం కలుగును.*
*ధనస్సు, మకర, మిధున, కన్య వారికి అశుభ ఫలం కలుగును*
కావున గ్రహణము అయిపోయిన తదుపరి, నక్షత్రం లేదా తిది తిరిగే లోపు శాంతి, దానం జరిపించుకోవడం మంచిది. రవి, సర్ప గ్రహములు చిన్న విగ్రహాలని రాగి వెండి ఇత్యాది లోహాలతో కూడినవి దాన చేసుకోవడం మంచిది. అలాగే గోధుమలు, ఉలవలు దానం అవసరం. గ్రహణ సమయంలో ఇంటియందు నీరు, పదార్థాలు లో దర్భ వేయడం మంచిది