YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

 బ్రిటన్ ఎన్నికల్లో15 మంది మనోళ్లు

 బ్రిటన్ ఎన్నికల్లో15 మంది మనోళ్లు

 బ్రిటన్ ఎన్నికల్లో15 మంది మనోళ్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 23  )
ఏ దేశమేగినా ఎందుకాలిడినా, పొగడరా నీతల్లి భూమిభారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం… బ్రిటన్ ఎన్నికల్లో ప్రవాస భారతీయుల విజయం తర్వాత ఇది గుర్తుకు రాక మానదు. భారతీయులు ఎక్కడ ఉన్నా తమ ప్రతిభా పాటవాలతో అందరినీ ఆకట్టుకోవాలని, అత్యున్నత స్థాయికి ఎదగాలని, జాతి గౌరవాన్ని ప్రతిష్టను పెంచాలన్నదిద స్థూలంగా దాని సారాంశం. బ్రిటన్ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని ఘంటా పథంగా చాటుతున్నాయి. ఈ నెల 12న జరిగిన బ్రిటన్ దిగువ సభ ఎన్నికల్లో మొత్తం 15 మంది ప్రవాస భారతీయులు ఘన విజయం సాధించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ తరుపున ఏడుగురు, విపక్ష లేబర్ పార్టీ తరుపున ఏడుగురు, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ తరుపున ఒకరు దిగువ సభకు ఎన్నిక కావడం విశేషం. గతంలో ఎన్నికైన 11 మంది మళ్లీ విజయం సాధించగా, ఈ దఫా ఈ మూడు పార్టీల తరుపున మరో నలుగురు చట్ట సభల్లోకి ప్రవేశించనున్నారు.అధికార కన్సర్వేటివ్ పార్టీ తరుపున ఎన్నికైన వారిలో ప్రీతీ పటేల్, రిషీ సునాక్, అలోక్ వర్మ ఉన్నారు. వీరిలో ప్రీతి పటేల్ హోంమంత్రిగా దేశ రాజకీయాల్లో, పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గుజరాత్ కు చెందిన ప్రీతి పటేల్ ప్రధాని నరేంద్రమోదీకి గట్టి మద్దతుదారు. తాజా ఎన్నికల్లో గెలిచిన ప్రీతి పటేల్ మళ్లీ హోం శాఖను చేపట్టే అవకాశముంది. విధామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రీతి పటేల్ 24,082 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పార్టీ విజయంలో ప్రీతి పటేల్ కీలక పాత్ర పోషించారనిి స్వయంగా ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించడం విశేషం. దీనిని బట్టి పార్టీలో, ప్రభుత్వంలో ఆమెకు గల ప్రాధాన్యం అర్థమవుతుంది. కన్జర్వేటివ్ పార్టీ తరుపున ఎన్నికైన మరో ప్రవాస భారతీయ ప్రముఖుడు రిషి సునాక్. ఈయన భారతీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. సునాక్ 27,210 ోట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయన తన పదవిని కాపాడుకునే అవకాశముంది. జాన్సన్ మంత్రివర్గంలో సునాక్ ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. మరో ప్రవాస భారతీయుడు అలోక్ వర్మ కూడా ఈ ఎన్నికల్లో నెగ్గారు. అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా ఉన్న వర్మ 24,393 ఓట్లతో గెలిచారు. అధికార పార్టీ తరుపున నవేంద్రు మిశ్రా, సిక్కు సంతతికి చెందిన ప్రీతి కౌర్, శైలేష్ వర గెలుపొందారు. మిశ్రా లేబర్ పార్టీ నాయకుడు. చట్టసభకు ఎన్నికైన తొలి ప్రవాస భారతీయ మహిళగా ప్రీతి కౌర్ చరిత్ర సృష్టించారు. బర్మింగ్ హోం నుంచి 21,217 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శైలేష్ వర నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జి షైర్ స్థానం నుంచి 25,983 ఓట్లతో గెలుపొందారు. సూళ్లె బ్రవర్మన్ 36,459 ఓట్లతో చట్టసభలోకి ప్రవేశించారు.విపక్ష లేబర్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం అయినప్పటికీ ఆ పార్టీ తరుపున పోటీ చేసిన ఏడుగురు ప్రవాస భారతీయులు మళ్లీ ఎన్నిక కావడం విశేషం. తమన్ జేత్ సింగ్ 13,640 మెజారిటీతో గెలుపొందారు. లేబర్ పార్టీ తరుపున స్లాఫ్ స్థానం నుంచి పోటీ చేసిన సింగ్ కన్జర్వేటివ్ అభ్యర్థి కన్వల్ గిల్ ను ఓడించారు. సీనియర్ ఎంపీ వీరేంద్ర శర్మ ఈలింగ్ సౌతౌలి స్థానం నుంచి 25,678 ఓట్లతో గెలుపొందారు. విశాన్ నుంచి బరిలోకి దిగిన లిసా నంది 21,042 ఓట్లతో విజయం సాధించారు. పార్టీ నేతల నుంచి ఆయన వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ విజయం సాధించడం విశేషం. హెస్టన్, వాల్సన్ నియోజకవర్గం నుంచి సీమా మల్హోత్రా గెలుపొందారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ తరుపున తొలిసారి పోటీ చేసిన గగన్ మెహింద్రా విజయం సాధించారు. ఇదే పార్టీ తరుపున మొదటి సారి బరిలోకి దిగిన క్లెయిర్ కౌంటినోన కూడా విజయాన్ని అందుకున్నారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మునీర్ విల్సన్ ను సయితం విజయలక్ష్మి వరించింది.2010 నుంచి వరుసగా కన్జర్వేటివ్ పార్టీ గెలుపొందడం కీలక పరిణామం. ఇటీవల ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా కన్జర్వేటివ్ పార్టీ అధినేత, ప్రధాని బోరిస్ జాన్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల మద్దతు కన్జర్వేటివ్ పార్టీకేనని మోదీ ప్రకటించారు. బోరిస్ జాన్సన్ కు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే అపార గౌరవం అభిమానం ఉన్నాయి. బ్రిటన్ లోని ప్రఖా్యత హిందూ దేవాలయమైన స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ప్రవాస భారతీయుల ఎన్నికతో బ్రిటన్ – భారత్ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశముంది.

Related Posts