జార్ఖండ్ ఫలితాలు: బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ
రాంచీ: తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ జేఎమ్ఎమ్ కూటమి 39 స్థానాల్లో ముందడుగులో ఉంది. జార్ఖండ్‌లో ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. కౌటింగ్ ప్రారంభమైన అనంతరం కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఏజెఎస్‌యూ 6 స్థానాల్లో, జేవిఎమ్ పార్టీ 3 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికారిన్ని చేపట్టాడినిక కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. జమ్షెడ్‌పూర్ స్థానం నుంచి బీజేపీ తరఫున రంగంలోకి దిగిన రఘుబర్ దాస్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు స్థానాల్లో పోటీకి దిగిన జేఎమ్ఎమ్ కీలక నేత హేమంత సోరేన్ కూడా ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ కీలక నేత గౌరవ్ వల్లభ్ వెనుకబడినట్టు తెసుస్తోంది. మరోవైపు జేవీఎమ్ కీలక నేత బాబూ లాల్ మరాండీ ప్రస్తుతం తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.