YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నామ మాత్రంగా మారిన కమీషన్లు...

నామ మాత్రంగా మారిన కమీషన్లు...

నామ మాత్రంగా మారిన కమీషన్లు...
విజయవాడ, డిసెంబర్ 23  
సున్నితమైన అంశాల్లో ఎలా స్పందించాలో అలా కాకుండా దూకుడు రాజకీయాలతో విమర్శల పాలు అవుతున్నారు వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. రాజధానిపై జి ఎన్ రావు నివేదిక రాకుండానే తన ఆలోచనను అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విమర్శలకు గురయ్యారు. జగన్ చెప్పిందే దాదాపుగా కమిటీ చెప్పడం దీనికి కారణం. దాంతో కమిటీ నివేదికను జగన్ ప్రభావితం చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. సేమ్ టూ సేమ్ విజయ సాయి రెడ్డి అలాగే వ్యవహరించి విమర్శలు ఆరోపణల పాలు అయ్యారు. భీమిలి లోనే సచివాలయం అభివృద్ధి అంతా జరుగుతుందని ప్రకటించేశారు.రాజధాని మార్పు అంశంపై వాస్తవంగా ఈనెల 27 వ తేదీన క్యాబినెట్ సమావేశం కావాలిసి వుంది. ఈ కీలక సమావేశంలో మంత్రి వర్గం జి ఎన్ రావు నివేదిక పై చర్చించిన అనంతరం ఒక నిర్ణయానికి రానుంది. ఆ తరువాత జనవరి మొదటి వారంలో రాజధాని మార్చడానికి కారణాలను వివరించి ఎపి లోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటామని సర్కార్ ప్రకటించింది. దీనికి భిన్నంగా ప్రభుత్వంలో కీలక భూమిక వహించే వారే లీకుల మీద లీకులు ఇస్తూ మరింత గందరగోళాన్ని సృష్ట్టించడంతో బాటు భగ్గుమంటున్న రాజధాని రైతుల ఉద్యమానికి మరింత ఆద్యం పోసేస్తున్నారు.ఈ తరహా రాజకీయానికి తొలిగా తెరతీసింది కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే అనడంలో సందేహం లేదు. ఆయన రాజధాని ఏర్పాటు విషయంలో అచ్చం ఇలాగే వ్యవహరించారు. శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది కానీ, శివరామ కృష్ణన్ నివేదికను చెత్తబుట్టలో పడేశారు. తన మనసులో మాట ప్రకటించేందుకు నారాయణ కమిటీ అంటూ సొంత టీం చేత అమరావతి తతంగాన్ని నడిపించి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే వీటిని ఆయన ఏ నాడు లెక్క చేయలేదు. తాను అనుకున్నది చేస్తున్నాని భావించి నేడు తప్పులో కాలేసి అన్ని వైపులా నిందలు మోసే పరిస్థితి తెచ్చుకున్నారు.ఇక కాపులకు రిజర్వేషన్ల అంశంలోనూ చంద్రబాబు మరింత దారుణంగా వ్యవహరించారు. మంజునాథ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆ కమిషన్ చైర్మన్ అభిప్రాయాలను పక్కన పెట్టించి మరి కమిటీలోని మిగతా సభ్యులతో తాను అనుకున్న నిర్ణయాలు వారి అభిప్రాయాలుగా ప్రకటించి కొత్త రాజకీయానికి తెరతీశారు. అదే ఇప్పుడు ఆయన గట్టిగా వైసిపిని నిందించలేని పరిస్థితి నేడు కొనితెచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ సైతం నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అనడం వెనుక ఇవే కారణాలు కావొచ్చన్న వ్యాఖ్యలకు టిడిపి దగ్గర జవాబు లేదు మరి. మొత్తానికి అటు టిడిపి ఇటు నేడు వైసిపి కూడా తాము వేసిన కమిటీలకు ఏమాత్రం విలువ గౌరవం ఇవ్వవని స్పష్టం చేసేశాయి అన్న ఆరోపణలు మాత్రం మూటగట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related Posts