YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 చెరకు చేదు (పశ్చిమగోదావరి)

 చెరకు చేదు (పశ్చిమగోదావరి)

 చెరకు చేదు (పశ్చిమగోదావరి)
ఏలూరు, డిసెంబర్ 23 : జిల్లాలో చెరకుసాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర, అవుతున్న ఖర్చుకు అనుగుణంగా లేకపోవడంతో నష్టాన్ని భరించలేక రైతులు సాగుకు దూరమవుతున్నారు. ఫలితంగా జిల్లాలో 2002లో 1.08 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైన చెరకు పంట ప్రస్తుతం 19వేల ఎకరాలకు తగ్గిపోయింది. దీంతో క్రషింగ్‌ రెండు ఫ్యాక్టరీలకే పరిమితమైంది. నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకు క్రషింగ్‌ సీజన్‌. ఐదారు నెలల పాటు నిత్యం లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపే ఈ వాణిజ్య పంట క్రమేపీ కనుమరుగవుతోందని చెప్పక తప్పదు. చెరకు దీర్ఘకాలిక వాణిజ్య పంట. 11నెలల నుంచి 13 నెలల వరకు సాగు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చెరకు మద్దతు ధర రూ. 2750గా ప్రకటించింది. ఎకరా విసీ్తీర్ణంలో సాగు చేస్తే సుమారు రూ. 1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. సగటు దిగుబడి 36 నుంచి 38 టన్నులుగా ఉంది. దీంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధర ఆశాజనకంగా లేకపోవడం, కూలీల కొరత, ఎక్కువ కూలి, పెరిగిన ఎరువుల ధరలు, కౌలు రైతులే సాగులో ఎక్కువగా ఉండటం వంటి కారణాలు చెరకు సాగుపై ఆసక్తి సన్నగిల్లడానికి కారణంగా చెబుతున్నారు. అంతేగాక కర్మాగారాలు రైతులకు ప్రోత్సాహం కలిగించాలనే ప్రయత్నాలు చేసినా చక్కెర ధర విపణిలో గత ఐదారేళ్లుగా ఆశాజనకంగా లేకుండా పోయింది. క్వింటాలు రూ. 3200 నుంచి రూ. 3300 మధ్య ఉండటంతో పరిశ్రమల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో చివరికి మూతపడుతున్నాయి. జిల్లాలో నాలుగు చక్కెర కర్మాగారాలు ఆంధ్రాసుగర్స్‌ (తణుకు, తాడువాయి, భీమడోలు, జైపూర్‌ సుగర్స్‌ (చాగల్లు) ఉన్నాయి. ఈ ఏడాది ఆంధ్రా సుగర్స్‌ యాజమాన్యంలోని తాడువాయి, భీమడోలు కర్మాగారాల పరిధిలోనే ప్రసుత్తం క్రషింగ్‌ జరుగుతోంది. 2018-2019 చెరకు గానుగ సీజన్‌లో 10,491 హెక్టార్లలో సాగు చేశారు. అదే ఏడాది 7,68,000 టన్నులు క్రషింగ్‌ చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గిపోయి 7,713 హెక్టార్లకే పరిమితమైంది. 5,50,000 టన్నుల చెరకు క్రషింగ్‌ లక్ష్యంగా ఉంది. ఈ నెల ఒకటో తేదీన తాడువాయి కర్మాగారం ప్రారంభించి 42,100 టన్నుల చెరకు క్రషింగ్‌ చేశారు. భీమడోలులో ఎనిమిదో తేదీన ప్రారంభించి 8,450 టన్నులు క్రషింగ్‌ చేశారని అధికారులు చెబుతున్నారు.

Related Posts