YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 కలవరం (అనంతపురం)

 కలవరం (అనంతపురం)

 కలవరం (అనంతపురం)
అనంతపురం, డిసెంబర్ 23 : మెరిట్ జాబితా సిద్ధం చేయడంలో జరుగుతున్న జాప్యం.. నిరుద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. వివిధ జిల్లాల్లో సదరు ప్రక్రియ పూర్తయినా అనంతపురం జిల్లాలో అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక డీఎస్సీ విడుదల చేశారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఇందుకు అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 806 పోస్టులు ఉండగా ఇందులో కొన్నింటిని పదోన్నతులతో భర్తీ చేశారు. ఇదేక్రమంలో 602 పోస్టులకు ప్రకటన విడుదల చేశారు. మెరిట్ లిస్ట్ రూపకల్పనలో చోటుచేసుకున్న జాప్యం... వివిధ జిల్లాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఊరిస్తూనే ఉంది.ప్రత్యేక విద్యను అందివ్వడానికి అర్హులైన 237 మంది నిరుద్యోగులు అనంతపురం జిల్లా నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జిల్లాలో 55 పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టుల్లో అర్హత సాధించిన వారిలో 117 మందికి అనుభవం గుర్తించాల్సి ఉంది. వీరంతా ఇది వరకే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక విద్యను బోధించడంతో అర మార్కు నుంచి అనుభవాన్ని బట్టి గరిష్ఠంగా ఐదు మార్కులు కలపాలి. వెయిటేజీలో వచ్చిన మార్కులు, ప్రత్యేక డీఎస్సీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేయాలి. రెండు నెలలు అవుతున్నా ఈ ప్రక్రియ చేపట్టలేదు. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జాబితా రూపకల్పనకు అనుభవానికి మార్కులు వేయాలంటే సమగ్రశిక్షలోని సహిత విద్య విభాగం ఆధ్వరంలో నిర్ధరణ చేయాల్సి ఉంటుంది. కేవలం ఒకటి రెండు రోజుల్లో చేసే ప్రక్రియను కొలిక్కి తేకపోవడం అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. మెరిట్ లిస్టును సిద్ధం చేసిన తర్వాతే సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మాత్రమే ఈప్రక్రియ పూర్తి చేయలేదు. ఈనేపథ్యంలో ఇతర జిల్లాల్లోని అభ్యర్థులకూ అవకాశం రాకుండా పోతోంది. వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేసి అనంతపురంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Related Posts