శ్రీరంగనాధ స్వామి ఆలయాన్ని ప్రభుత్వ ధనం తో నిర్మించాలి
నెల్లూరు, డిసెంబర్ 23, :
రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ ధర్మం పట్ల నిజమైన విశ్వసం వుంటే నెల్లూరు నగరం పప్పల వీధీలో కూల్చిన శ్రీరంగనాధ స్వామి ఆలయాన్ని ప్రభుత్వ ధనం తో వెంటనే నిర్మించాలని హిందూ సంస్థలు అందోళనకు దిగాయి. తిరుమలలో 600 పళ్ల నాటి చరిత్ర కలిగిన గొల్లమండపాన్ని తొలగించేందుకు టి.టి.డి అధికారులు సన్నిధి గొల్లలతో చర్చించారు. గొల్లమండపం తోలగించే హక్కులు ఎవ్వరికి లేవు. ఆద్యాత్మిక, మతవిశ్వాసాలకు, ఆలయ నిర్మాణ చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా గొల్లమండపం వుంది. గొల్ల మండపం పటిష్టత కొరకు స్టెయిన్ లెస్ స్టీల్ తో స్థూపాలకు తాపడం చేయించి సుందరీకరణ చేయ్యాలని డిమాండ్ చేసారు. గొల్లమండపం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు,. ప్రతి ఏడు టి.టి.డి ముద్రించే శ్రీవారి డైరీలు భక్తులకు అందేలాలేవు. టి.టి.డి డైరీలలో విధిగా ఉండాల్సిన పంచాంగం, తిధులు, నక్షత్రాలు, శ్లోకాలలో కొన్ని మాయమయ్యాయి. గతంలోమూడు నెలల మందు నుండే భక్తులకు డైరీలు అందుభాటులో వుండేవి. కానీ ఇప్పుడు రెండు రోజులు క్రితం డైరీలు ఆవిష్కరించారు. తక్కువగా ముద్రించడమే కాకుండా హిందు ధర్మ ప్రచారాన్ని టి.టి.డి. నుండి దూరం చేసే కుట్ర జరుగుతుందని వారు ఆరోపించారు.
===========================