YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మరోసారి బేర్ మంటున్నదలాల్ స్ట్రీట్..

Highlights

  • తొలి రోజే బీడీఎల్‌కు దెబ్బ..
  • అంతర్జాతీయ మార్కెట్లదీ అదే పరిస్థితి..
మరోసారి బేర్ మంటున్నదలాల్ స్ట్రీట్..

అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్యయుద్ధం కారణంగా  స్టాక్‌ మార్కెట్‌ బెంబేలెత్తిపోతుంది. ఈ రెండు దేశాల ఎకనమిక్ వార్ తో దేశీయ మార్కెట్లతో పాటుగా  ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను వణికిస్తోంది. మొన్నటికి మొన్న స్టీల్, అల్యుమినియం దిగుమతులపై సుంకం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..తాజాగా చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకం విధించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లను కలవరానికి గురిచేసింది.అంతర్జాతీయంగా అన్ని దేశాలకు ఈ ఎఫెక్ట్ తగలడంతో.. దేశీయంగా దలాల్ స్ట్రీట్ మరోసారి బేర్ మంది. ప్రపంచ వ్యాణిజ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. ఉదయం నుంచి బేరిష్ ట్రెండ్‌లో ఉన్న సెన్సెక్స్... చివర్లో 410 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టి 10వేల కంటే దిగువకు పడిపోయింది. మొత్తం మీద.. లక్షా 57వేల కోట్ల మదుపరుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. చైనాపై ట్రంప్‌ వాణిజ్య ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లు డీలా పడ్డాయి. మరోవైపు అమెరికాకు చెందిన 128 వస్తువులపై చైనా కూడా పన్ను విధిస్తోందన్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు సెల్లింగ్ ప్రెషర్‌కు లోనయ్యారు. దీంతో మార్కెట్ మరోసారి విలవిలలాడింది. అంతర్జాతీయ భయాలకు తోడు.. దేశీయంగా బ్యాంకులకు నిరర్థక ఆస్తులు పెరుగుతున్న వార్తలు రావడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను హరించింది. దీనికి తోడు వీకెండ్ కూడా కావడంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్త పడ్డారు. దీనితో ఉదయం నుంచి బేరిష్ ట్రెండ్‌లోనే ఉన్న సెన్సెక్స్‌ 410 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ ఈ ఏడాదిలోనే తొలిసారిగా 10,000 మార్క్‌ కిందకు పడిపోయింది.జపాన్ నిక్కీ 974 పాయింట్లు నష్టపోగా.. హాంగ్‌సెంగ్ 762 పాయింట్లు కోల్పోయింది. ఇక దేశీయంగా... సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనమైన సూచీ.. చివరకు 410 పాయింట్లు కోల్పోయి...32వేల 596 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 10వేల దిగువకు పడిపోయింది. 117 పాయింట్ల నష్టంతో 9వేల 998 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ కంపెనీలైన ... వేదాంతా, హిందాల్కో షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక్కో షేరు విలువ 5శాతానికి పైగా పడిపోయింది. వీటితో యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, లుపిన్‌ షేర్లు కూడా నష్టాలను చవిచూడగా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు కాస్త లాభపడ్డాయి. మొత్తంగా మీద.. శుక్రవారం లక్షా 57వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బిఎస్ఇ షేర్ల విలువ 140.87లక్షల కోట్ల నుంచి 139.3లక్షల కోట్లకు పడిపోయింది. పైగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఐదు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. ఫలితంగా వారంతం ట్రేడింగ్ ప్రారంభం నుంచే కుప్పకూలిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనం చెందిన బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ చివరకు 409.73 పాయింట్లు లేదా 1.24 శాతం నష్టంతో 32,596.54 వద్దకు జారుకున్నది. మరోవైపు 10వేల మైలురాయి కంటే దిగువకు పడిపోయిన నిఫ్టీకి.. 9వేల 900 వద్ద మద్దతు దొరికే అవకాశముందని నిపుణులు అంచనావేస్తున్నారు. బ్యాకింగ్, మెటల్, ఆటోమోబైల్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లలో అమ్మకాలు
జోరుగా సాగాయి. 

తొలి రోజే బీడీఎల్‌కు దెబ్బ..
స్టాక్ మార్కెట్లో లీస్టైన తొలిరోజే ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ భారత్ డైనమిక్స్ (బీడీఎల్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇష్యూ ధర రూ.428 కంటే తొమ్మిది శాతం తక్కువకు పడిపోయింది. రూ.360 వద్ద లిైస్టెన షేరు ఇంట్రాడేలో 15.88 శాతం పడిపోయింది. చివరకు 8.71 శాతం తగ్గి రూ.390.70 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 8.92 శాతం పతనం చెంది రూ.389.90 వద్దకు చేరుకున్నది.
అంతర్జాతీయ మార్కెట్లదీ అదే పరిస్థితి..
అమెరికా తీసుకున్న నిర్ణ యం అంతర్జాతీ మార్కెట్లలో అమ్మకాలు పోటెత్తాయి. దీంతో వాల్‌స్ట్రీట్ జర్నల్ భారీగా నష్టపోగా.. మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన ఆసియా, యూరప్ మార్కె ట్లు కూడా దిగువముఖం పట్టాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 4.51 శాతం పతనం చెందగా, హాంకాంగ్స్ హ్యాంగ్‌సెంగ్ 2.45 శాతం, షాంఘై కంపోసైట్ ఇండెక్స్ 3.39 శాతం వరకు కోల్పోయింది.

Related Posts