అభివృద్ధి అంటే ఆదాయం సృష్టించడం
అమరావతి డిసెంబర్ 23
రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న అందోళనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతుగా నిలిచారు. సోమవారం జరిగిన అందోళన కార్యక్రమానికి అయన హజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఆడబిడ్డలు రోడ్డు మీదకు వచ్చారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా రైతులు రోడ్డు మీదకు వచ్చారు. అద్దరికీ సమాన దూరంలో రాజధానిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రిగా నా పిలుపుమేరకు రైతులు భూములు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ ద్వారా రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అలాంటి చరిత్ర సృష్టించిన రైతాంగం చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోతారని అనుకున్నా.రైతులకు భూమితో యనలేని అనుబంధం ఉంటుంది.. కానీ రాష్ట్ర భవిష్యత్. కోసం రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు. తమ పిల్లల భౌవిష్యత్ బాగుంటుందన్న ఉద్దేశ్యంతో రైతులు భూములు ఇవ్వడం జరిగింది. ఒక ఇళ్లు కట్టాలంటే 3నాలుగు రోజులు పడుతుంది. అలాంటి రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందని అన్నారు. ప్రపంచం రైతు దినోత్సవం సందర్భంగా సంతోషంగా ఉండవలసిన రైతులు రోడ్లు మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హమీలను కోనసాగించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉంది. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఈ ప్రభుత్వం అంటుంది. రైతులకు ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. రాజధాని నిర్మాణానికి దేశంలోని అన్ని ప్రముఖ స్థలాల నుండి నీళ్లు మట్టి తీసుకురావడం జరిగింది. రైతులకు ప్లాట్స్, మౌలిక సదుపాయాలు పోగా పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఉన్న భూమి మీద వచ్చే డబ్బులతోనే రాజధాని నిర్మాణం చేయవచ్చు. పరిపాలనతోనే అభివృద్ధి కాదూ... హైదరాబాద్ లో ఇవ్వన్నీ ఉన్నా అభివృద్ధి జరగలేదు... ఐటీ వచ్చిన తరంవాతే అభివృద్ధి జరిగింది. అభివృద్ధి అంటే ఆదాయం సృష్టించడం. గతంలో ఇక్కడ వేల మంది నిత్యం ఇక్కడ పనులు చేసేవారు. అలాంటిది ఈ రోజు రాజధాని ప్రాంతం నిర్మానుష్యంగా ఉందని అన్నారు. పోట్టి శ్రీరాములు త్యాగంతో బాషా సంయుక్త రాష్ట్ర వచ్చింది. 60సంవత్సరాలు అభివృద్ధి చేసిన హైదరాబాద్ ని వదిలిపెట్టి ఇక్కడికి రావలసిన పరిస్థితి ఏర్పడింది. అమరావతి అంటే చరిత్ర ఉన్న నగరం. రాజధాని నిర్మాణానికి బంగారు బాతు వంటి అమరావతిని ఈ రోజు కూల్చేశారు. అమరావతి ల్యాండ్ ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో పెడితే గంటలో 2వేల కోట్లు వచ్చాయి. ఇప్పటికైనా అమరావతి నిర్మాణానికి రూపాయి ఖర్చు చేయవలసిన అవసరం లేదూ.. ఇక్కడ ఉన్న ఆస్తులు చాలు. గతంలో అమరావతి నిర్ణయం తీసుకునప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. గతంలో రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు కావాలని చెప్పిన జగన్ ఇప్పుడు 3వందల ఎకరాలు చాలు అంటున్నారు. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్ చెబుతున్నారు.. ప్రభుత్వం దమ్ముంటే ఎంక్వైరీ వేయాలన్నారు. దమ్ముంటే హైకోర్టు ద్వారా జూడిషియర్ ఎక్వైరీ వేయాలి. మంత్రులు, స్పీకర్ ఎడాలి స్మశానంతో పోల్చడం బాధాకరమని అన్నారు. అమరావతిలో మునిగిపోయిన చరిత్రలేదు. సుప్రీం, గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతి నిర్మాణాన్ని స్వాగతించాయి. గతంలో అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి రైతులు పర్మిషన్ అడగటంతోనే చట్టం ఇవ్వడం జరిగిందని చంద్రబాబు అన్నారు.