YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మెట్రోలో క్యూఆర్ కోడ్

మెట్రోలో క్యూఆర్ కోడ్

మెట్రోలో క్యూఆర్ కోడ్
హైద్రాబాద్, డిసెంబర్ 23, 
మెట్రో రైలు ప్రయాణానికి క్యూఆర్ కోడ్ టికెట్ బుకింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ విధానాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మేక్ మైట్రిప్ సీఈవో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. సమయం వృథా కాకుండా మేక్ మై ట్రిప్ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణికులు ప్రయాణించొచ్చు. ఆరుగురి వరకు ఒకేసారి మేక్ మై ట్రిప్ లో బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. బుక్ చేసిన ట్రిప్ ను వాట్సాప్ ద్వారా సంబంధిత వ్యక్తులకు షేర్ చేసుకోవచ్చు అని మెట్రో ఎండీ చెప్పారు. వాట్సాప్ ద్వారా రిసీవ్ చేసుకున్న వ్యక్తులు వేరే వారికి షేర్ చేయొద్దు. మొదట 20 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. జనవరి నుంచి మిగతా అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.మెట్రోకు సంబంధించిన యాప్‌ను మొబైల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోనుంచి క్యూఆర్‌కోడ్‌ ద్వారా చెల్లింపులు జరిపి హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించవచ్చు. ప్రయాణాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో మెట్రోరైలులో క్యూఆర్‌కోడ్‌ టికెటింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే ఈ విధానం ద్వారా స్టేషన్‌కు రాకుండానే ముందుగానే మెట్రోరైలు రాకపోకలకు సంబంధించిన టికెట్లు బుక్‌చేసుకునే వీలుంటుంది. కాగా వ్యాలెట్లో సరిపడా డబ్బులు ఉండాల్సిన అవసరముంది.ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ ఈయాప్‌ను రూపొందించింది. సంబంధించిన యాప్‌లోకి వెళ్లి ఎక్కాల్సిన స్టేషన్‌, ప్రయాణంలో దిగాల్సిన స్టేషన్‌ పేర్లను నమోదు చేస్తే టికెట్‌ చార్జి కనబడుతుంది. ప్రొసీడ్‌ టూ పే అనే ఆప్షన్‌ కనబడుతుంది. పేమెంట్‌ పూర్తికాగానే టికెట్‌ యాప్‌లో కనబడటంతోపాటు మీ మొబైల్‌కు సంక్షిప్త టికెట్‌కు సంబంధించిన సమాచారం వస్తుంది. దీంతోపాటు స్టేషన్‌ ఎంట్రీలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి మెట్రోరైలు ఎక్కిన తర్వాత గమ్యస్థానానికి సంబంధించిన ఎగ్జిట్‌ గేట్‌ ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌(ఏఎఫ్‌సీ) దగ్గర క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే వ్యాలెట్‌ నుంచి టికెట్‌ చార్జి కట్‌ అవుతుంది.ప్రయాణికులు సులభంగా టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రస్తు తం అమల్లో ఉన్న దాదాపు అన్ని వ్యాలెట్లను వినియోగించుకునేలా యాప్‌ను రూపాందించారు. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, మొబీక్విక్‌, భీమ్‌, అమెజాన్‌పే, సామ్‌సాంగ్‌పే, ఏయిర్‌టెల్‌పే, జియోమనీ, మేక్‌మైట్రిప్‌, గోయిబిబో, బుక్‌మైషో వంటి వ్యాలెట్లను ఉపయోగించుకోవచ్చు. వీటిని ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్ల వద్ద ఉన్న స్కాన్‌ చేసి సులభంగా మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు. ఇటువంటి విధానాన్ని ఢిల్లీ మెట్రోలో అమల్లోకి తెచ్చారు.-స్మార్ట్‌కార్డు, టోకెన్స్‌ స్థానంలో క్యూఆర్‌కోడ్‌ విధానం అమల్లోకి తెచ్చారు. అయితే ఇప్పటికే మెట్రో ప్రయాణికుల్లో 60 శాతం మంది స్మార్ట్‌కార్డులు వాడుతున్నారు. హైదరాబాద్‌ మెట్రోరైలు అందుబాటులోకి తెస్తున్న యాప్‌ను ఉపయోగించుకుని టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని అందులో ప్రయాణికుడి మొబైల్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.యాప్‌ను ఓపెన్‌చేసి ఎక్కే స్టేషన్‌తోపాటు దిగాల్సిన స్టేషన్‌ను పేర్కొనాల్సి ఉంటుంది.ఎంతమంది ప్రయాణిస్తారో కూడా ఇందులో పేర్కొనాల్సి ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఫేర్‌ మొబైల్‌ స్క్రీన్‌పై దర్శనమిస్తుంది.ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ గేట్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి ప్రయాణం చేయవచ్చు.

Related Posts