YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 కోఆపరేటివ్ కళాశాలలు మూసివేత దిశగా అడుగులు...

 కోఆపరేటివ్ కళాశాలలు మూసివేత దిశగా అడుగులు...

 కోఆపరేటివ్ కళాశాలలు మూసివేత దిశగా అడుగులు...
రాజమండ్రి, డిసెంబర్ 24,
రాష్ట్రంలో సహకార శిక్షణ, విద్య వ్యవస్థ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. వ్యవసాయ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సహకార వ్యవస్థ కాల క్రమేణా తన ఉన్నతిని కోల్పోతోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగైదు జిల్లాలకు సంబంధించిన సహకార సిబ్బంది, పాలకవర్గాలకు శిక్షణ కల్పించే సహకార విద్యా కళాశాలలు అంతర్ధానమవుతున్నాయి. కాలక్రమేణా వివిధ జిల్లాలకు కేంద్రంగా వుండే సహకార విద్యా శిక్షణా కళాశాలలు ఒకే చోట కేంద్రీకృతమవుతుండటం చూస్తుంటే సహకార విద్య ప్రాధాన్యత కోల్పోతున్నట్టుగా తయారైంది. రాష్ట్ర సహకార శాఖలో రాష్ట్రంలోనే ఏకైక సహకార శిక్షణా కళాశాల ఉన్న రాజమహేంద్రవరంలో రామదాసు సహకార శిక్షణా కళాశాల విజయవాడలోని రాష్ట్ర కో ఆపరేటివ్ శిక్షణా, ఎంప్లారుూస్ కో ఆపరేటివ్ సొసైటీలో విలీనం చేసేందుకు ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో వున్న ఏకైక శిక్షణా కళాశాల కూడా రాష్ట్ర స్థాయిలో విలీనం కాబోతోందని తెలుస్తోంది. వాస్తవానికి సహకార శిక్షణా కళాశాలలు రాష్ట్రంలో నాలుగు ఉండేవి. ఇందులో విజయవాడ, రాజమహేంద్రవరంలోని కో ఆపరేటివ్ శిక్షణా కళాశాల, కడపలో కో ఆపరేటివ్ శిక్షణా కళాశాల, అనంతపురంలోని రాయలసీమ కో ఆపరేటివ్ శిక్షణా కళాశాల ఉండేవి. ఇందులో కడపలోని కళాశాల పూర్వం నుంచీ విజయవాడలోని యూనియన్ కో ఆపరేటివ్ సొసైటీ నిర్వహణలోనే ఉండేది. అనంతరం అనంతపురం కోలేజిని విలీనం చేశారు. ఇపుడు రాజమహేంద్రవరంలోని రామదాసు కో ఆపరేటివ్ శిక్షణా కాలేజీని విజయవాడలోని ఎంప్లారుూస్ కో ఆపరేటివ్ సొసైటీలో విలీనం చేసేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం నుంచి రేడో రేపో ఉత్తర్వులు రానున్నాయన్నట్టుగా ఉంది. ఈ శిక్షణా కాలేజీలు, రాష్ట్ర యూనియన్ కో ఆపరేటివ్ సొసైటీ అదనపు రిజిష్ట్రార్ స్థాయి సహకార ఎండీ అధీనంలో పర్యవేక్షణ కలిగి వుంటాయి. ఒక్కో కళాశాల ఒక ప్రిన్సిపాల్, నలుగురు సహకార అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఉన్నారు. రాజమహేంద్రవరంలో ఉన్న రామదాసు సహకార శిక్షణా కళాశాల పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని ప్రాధమిక సహకార సొసైటీల సిబ్బంది, పాలకవర్గాలకు శిక్షణ కల్పిస్తారు. విజయవాడ సహకార శిక్షణా కళాశాల పరిధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు, కడప పరిధిలోని కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పాలకవర్గాలు, సహకార సిబ్బందికి, అనంతపురం సహకార కాలేజీ పరిధిలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు సంబంధించిన సహకార సొసైటీల పాలకవర్గాలు, సిబ్బందికి శిక్షణ కల్పిస్తారు. రాజమహేంద్రవరంలోని రామదాసు సహకార శిక్షణా కళాశాల పరిధిలో సుమారు 300 ప్యాక్‌లకు, పశ్చిమలోని 270 సొసైటీలకు శిక్షణ కల్పిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని సహకార శిక్షణా కళాశాల పాలకవర్గంలో గతంలో ఐదు డీసీసీబీ ఛైర్మన్లు, ఐదుగురు డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లాకొక ప్యాక్ చొప్పున 15 మందితో పాలకవర్గం ఉండేది. ఇందులోనించే ఒకరు ఛైర్మన్‌గా ఉండేవారు. ఈ పాలకవర్గం అధికారంలో ఉన్నపుడే రామదాసు సహకార శిక్షణా కళాశాలను విజయవాడలో కేంద్రంలో విలీనం చేయాల్సిందిగా ప్రతిపాదించారు. ఏదేమైనప్పటికీ సహకార శిక్షణా కళాశాలలు అన్నీ ఇపుడు ఒకే ప్రాంతానికి పరిమితంగా మారనున్నాయి.

Related Posts