YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 శివసేన సర్కార్ పై ఎన్సీపీ పట్టు 

 శివసేన సర్కార్ పై ఎన్సీపీ పట్టు 

 శివసేన సర్కార్ పై ఎన్సీపీ పట్టు 
ముంబై, డిసెంబర్ 24
ఉద్ధవ్ థాక్రే కుదురుకుంటున్నారు. వత్తిడులకు తలొగ్గుతున్నారు. కూటమిలోని పార్టీల అజెండాను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో రైతు రుణ మాఫీ కూడా నేషనలిస్ట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రతిపాదన. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రైతు రుణ మాఫీ ప్రకటన చేశారు. రెండు లక్షల రూపాయల రుణం ఉన్న రైతులందరికీ ఈ రుణ మాఫీని వర్తింప చేస్తున్నట్లు ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఈ ఏడాది సెప్టంబరు 30వ తేదీ వరకూ ఉన్న రుణాలన్నింటికీ ఈ పథకం వర్తిస్తుందని ఉద్ధవ్ థాక్రే తెలిపారు.నిజానికి మహారాష్ట్రలో రైతు సమస్యలు ఈనాటివి కావు. రైతు రుణమాఫీ చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మహారాష్ట్రలో రైతులు ఎప్పుడో రోడ్డెక్కారు. సరైన ధరలు లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయామని వారు అనేక సార్లు తమ ఆందోళనలు వ్యక్తం చేశారు. అయితే రుణ మాఫీకి గత బీజేపీ ప్రభుత్వం ముందుకు రాలేదు. వర్షాభావ ప్రాంతాల్లో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చివరకు రైతుల వత్తిడికి తలొగ్గి ఎన్నికలకు ముందు 2017లో యాభై లక్ష మంది రైతులకు మాత్రమే బీజేపీ ప్రభుత్వం రుణమాఫీని చేయగలిగింది.మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి నలభై నిమిషాల పాటు చర్చించారు. రైతు సమస్యలపైనే తాను చర్చించినట్లు శరద్ పవార్ తెలిపారు. అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీ చేస్తామని శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. కాంగ్రెస్ సయితం ఇదే ప్రచారాన్ని నిర్వహించింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో రైతు రుణమాఫీ ప్రకటనతోనే కాంగ్రెస్ సక్సెస్ అవ్వడంతో అదే ఫార్ములాను మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ఎంచుకుంది.మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్, ఎన్సీపీలు రైతు రుణమాఫీని చేయాలని ఉద్ధవ్ థాక్రే వద్ద ప్రధాన డిమాండ్ ను ఉంచాయి. రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తే ప్రభుత్వం పైన నలభై కోట్ల రూపాయల వరకూ భారం పడుతుంది. దీనిపై తొలుత ఉద్ధవ్ థాక్రే కొంత సంశయించినా మిత్రుల వత్తిడికి తలొగ్గక తప్పలేదు. రైతు రుణ మాఫీ చేసిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ గురించి చర్చిద్దామన్న ఎన్సీపీ, కాంగ్రెస్ ల షరతు మేరకే ఉద్ధవ్ థాక్రే రైతు రుణమాఫీ చేసినట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో ఉద్ధవ్ థాక్రే రెండు పార్టీలు చెప్పినట్లు తలాడించక తప్పే పరిస్థతులే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Related Posts