Highlights
- ఐపీఎల్ కోసం కోహ్లీ, ధోనీల బాటలో
- రాహుల్‌కి సారీ చెప్పిన యువరాజ్
- ఏప్రిల్ 7 నుంచి మెగా టోర్నీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో యువరాజ్ సింగ్ తన సొంత జట్టయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున మరోసారి ఆడనున్నాడు.ఈ ఐపీఎల్ మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను దాదాపు ఒకటిన్నర నెల పాటు ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభమయే ఈ టోర్నీకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లు కూడా డిఫెరెంట్ లుక్‌తో మైదానంలో కనువిందు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ సారథి విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు 'పంజాబ్ షేర్' యువరాజ్ సింగ్ వచ్చి చేరాడు. అందుకు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ను యువీ ఆశ్రయించాడు. తన స్నేహితురాలు అంగద్ బేడీ బలవంతం మేరకు ఈ కొత్త హెయిర్ స్టైల్ చేయించుకున్నానని అతను తెలిపాడు. ఇక టీమిండియా యువ సంచలనం కేఎల్ రాహుల్ హెయిర్ స్టైల్‌ని కాపీ కొట్టినందుకు అతనికి యువీ సారీ చెప్పాడు. తన కొత్త కేశాలంకరణకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా యువీ పంచుకున్నాడు.