32 జిల్లాలకు షీ టీమ్స్... స్పెషల్ నెంబర్లు
హైద్రాబాద్, డిసెంబర్ 24,
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించేందుకు 33 జిల్లాలోని షీ-టీమ్ లకు శిక్షణ నివ్వడంతో పాటు రాష్ట్ర స్థాయి నోడల్ టీమ్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. షీ నోడల్ టీమ్ ద్వారా అన్ని జిల్లాల్లోని మహిళా కళాశాలలు, మహిళా సంఘాలకు సెల్ఫ్ డిఫెన్స్ లోనూ, సైబర్ క్రైమ్ నేరాలపై ప్రత్యేక అవగాహన శిక్షణ తరగతులను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలో షీ-టీమ్, డయల్ 100 ,హాక్‌ఐలపై చైతన్యం పెంపొందించేందుకై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేశారు.లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు చెందిన వాట్సప్ నంబర్లను అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ 9490617111, రామగుండం 9908343838, హైదరాబాద్ 9490616555, వరంగల్ కమిషనర్ 9491089257, ఖమ్మం 9494933940, ఆదిలాబాద్ 9963349953, మెదక్ 9573629009, వికారాబాద్ 9849697682, నల్గొండ 9440066044, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ 9490618029, కొత్తగూడెం 9949133692, సంగారెడ్డి 9490617005,ఆర్‌పి సికింద్రాబాద్ 9440700040, నిర్మల్ 9490619043, మహబూబ్‌నగర్ 9010132135, సైబరాబాద్ కమిషనర్ 9490617444, కామారెడ్డి 8985333321, నాగర్‌కర్నూల్ 9498005600, సూర్యాపేట 9494444833, సిద్దిపేట పోలీస్ కమిషనర్ 7901640473, కరీంనగర్ పోలీస్ కమిషనర్ 9440795183, మహబూబాబాద్ 9989603958, రాజన్న సిరిసిల్ల7901132113, జయశంకర్ భూపాల్‌పల్లి 9705601290, కుమ్రంభీం ఆసీఫాబాద్ 9440957623, గద్వాల 7993131391. జగిత్యాల 8374020949, వనపర్తి 6303923211 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా షీటీమ్‌లకు బాధిత మహిళల ఫిర్యాదులపై నియమిత సమయంలో చర్యలు చేపట్టారా లేదా అన్న అంశాలను పర్యవేక్షించేందుకుగాను హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రస్థాయి షీ-టీమ్ ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. హైదరాబాద్ నగరంలో ప్రయాణాలకై క్యాబ్ లను బుక్ చేసుకోగానే బుక్ చేసిన వారి సమాచారంతో పాటు క్యాబ్ ప్రయాణించే మార్గాన్ని కూడా తెలుసుకునే విధంగా సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు. కాగా నెట్ కనెక్షన్ ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా హాక్ -ఐ బటన్ నొక్కితే జీ.పి.ఎస్ విధానం ద్వారా ఆటోలో గాని, క్యాబ్ లో గాని ప్రయాణించే మార్గాన్ని సులభంగా ట్రాకింగ్ చేసే విధంగా, నెట్ సౌకర్యంలేని ఫోన్ ద్వారా హాక్-ఐలో ఉండే ఎస్.ఒ.ఎస్ బటన్ నొక్కితే కాల్ నేరుగా డయల్ 100 కు వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు.మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన షీటీమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ఇటీవల దిశ ఘటనతో పాటు హాజీపూర్, హన్మకొండ, జడ్చర్ల తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న మహిళ, చిన్నారులపై నేరాలపై పోలీసు బాసులు సీరియస్ అయ్యారు. రాష్టంలోని జిల్లాలలో షీటీంలను వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు షీటీమ్స్ భరోసా కల్పిస్తాయన్న ప్రచారం చేపట్టాలని అన్ని జిల్లా ఎస్‌పిలకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రాధాన్యంతో పాటు మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడితే వెంటనే షీటీమ్స్ ఫిర్యాదు చేసేవిధంగా ఫోన్, వాట్సప్ నంబర్లులను తెలియపరిచేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల గృహ హింస, పిల్లలపై దురాగతాలు జరుగుతున్న సమయంలో వెంటనే షీటీమ్‌కు ఫిర్యాదు చేసే విధంగా కాలేజీలు, షాపింగ్ కాంప్లెక్స్, బస్‌స్టాప్,బస్సులో ఆయా ప్రాంతాల షీటీమ్స్ నంబర్లు కనిపించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి ఆదేశాలిచ్చారు.జిల్లాలోని షీ టీమ్స్‌ను పనితీరు, ఫిర్యాదులపై విచారణ, కేసులలో పురోగతి తదితర అంశాలన్నీ ఆయా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒలు బాధ్యత వహించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈక్రమంలో జిల్లాలలోని షీటీమ్స్‌లో పనిచేసే పోలీసులకు హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక శిక్షణ సైతం పూర్తిచేశారు. షీటీమ్స్ బృందాలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుల విషయంలో ఆయా ప్రాంతంలోని స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కేసు దర్యాప్తు విషయాలలో జిల్లాలలో షీటీమ్స్, స్థానిక పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని ఆదేశాలిచ్చారు. జిల్లాలలోని ఫిర్యాదుల వివరాలను ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని షీటీమ్స్ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించాలని, కేసులలో పురోగతి, దర్యాప్తు వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ఫిర్యాదులపై ఎప్పటిప్పుడు సమీక్షలు నిర్వహించాలని, బాధితులకు న్యాయం జరుగని పక్షంలో ఆయా పోలీసు స్టేషన్ల ఎస్‌హెచ్‌ఒల నైతికంగా బాధ్యవహించాలని పోలీసు బాసులు వివరిస్తున్నారు.