ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గర్భం దాల్చిన విద్యార్థిని.
విశాఖపట్నం డిసెంబర్ 24
విశాఖ మాన్యంలో మైనర్ బాలిక గర్భం దాల్చడం తీవ్ర సంచలనంగా మారింది. జి.మాడుగుల మండలం నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధిని రక్త హీనతతో ఉండగా వైద్య పరీక్షలు నిర్వహించగా 5 నెలల గర్భవతిగా తేలింది. విద్యార్థిని తల్లిదండ్రులు బాలికను నిలదీయగా స్థానిక యువకుడితో స్నేహబంధం వివరించింది. స్థానికంగా ఉన్న యువకుడి కారణంగా ఆశ్రమ పాఠశాలలో మైనర్ బాలిక గర్భవతి అయిన విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ సభ్యురాలు మత్యరాస మణికుమారి నుర్మతి ఆశ్రమ పాఠశాలను సందర్శించి, విద్యార్థినులను, ఉపాధ్యాయ సిబ్బందిని, బాలిక, బాలిక తల్లిదండ్రులను వేరు వేరుగా ప్రశ్నించి వివారాలు సేకరించారు.