YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్ట్

హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్ట్

హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్ట్
హైదరాబాద్‌ డిశంబర్ 24   
దిశ హత్యాచార కేసు నిందితుల రీపోస్టుమార్టం వీడియో సీడీని ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు మంగళవారం హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించారు. హైకోర్టు ఈ నెల 21న జారీచేసిన ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు నిన్న గాంధీ ఆస్పత్రిలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టం ప్రక్రియ నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ సుధీర్‌గుప్తా, డాక్టర్‌ ఆదర్శ్‌కుమార్‌, డాక్టర్‌ అభిషేక్‌యాదవ్‌, డాక్టర్‌ వరుణ్‌ చంద్రలతో కూడిన బృందం నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు గాంధీ దవాఖానకు చేరుకున్న ఎయిమ్స్‌ బృందం.. సాయంత్రం 4 గంటల వరకు రీపోస్టుమార్టం చేశారు.కుటుంబసభ్యులు మృతదేహాలను గుర్తించిన తర్వాత వాటికి ఎక్స్‌రే తీయించి, వారి ముందే రీపోస్టుమార్టం నిర్వహించారు. ఆరు గంటలపాటు సాగిన రీపోస్టుమార్టం ప్రక్రియను హ్యాండ్‌క్యామ్‌తో వీడియో తీశారు. పోస్టుమార్టం సమయంలో పోలీసులతో సహా గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌, ఫోరెన్సిక్‌ వైద్యులను కూడా లోనికి అనుమతించలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం పోస్టుమార్టం ప్రక్రియను గోప్యంగా నిర్వహించారు. అనంతరం నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించగా, రెండు అంబులెన్స్‌ల్లో పోలీసు బందోబస్తు నడుమ స్వగ్రామాలకు తరలించారు.దిశ కేసు నిందితుల మృతదేహాలకు సోమవారం రాత్రి వారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. రీపోస్టుమార్టం అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నారాయణపేట జిల్లా గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామాలకు మృ తదేహాలు తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు రాత్రి 8 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతదేహాలు 17 రోజుల తర్వా త ఇండ్లకు చేరాయి. జొల్లు శివ, జొల్లు నవీన్‌ అవివాహితులు కావడంతో అంత్యక్రియలకు ముందు వారి సంప్రదాయం ప్రకారం ఇండ్ల ముందు పందిళ్లు వేసి కత్తులతో పెండ్లిళ్లు చే శారు. శివ, నవీన్‌, చెన్నకేశవుల మృతదేహాలను గుడిగండ్లలోని వారి వ్యవసాయ పొల్లా లో ఖననంచేశారు. మరో మృతుడు ఆరిఫ్‌ (మహ్మద్‌ పాషా) అంత్యక్రియలు స్వగ్రామమైన జక్లేర్‌లో ఇస్లాం సంప్రదాయ ప్రకారం నిర్వహించారు

Related Posts