YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

భద్రాద్రి రాములోరికి ఆభరణాలు 

Highlights

  • 13.50 కిలోల బంగారంతో స్వర్ణ కవచం
  • బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతుల కానుకలు
  • ప్రతి శుక్రవారం బంగారు రామయ్యగా దర్శన భాగ్యం
భద్రాద్రి రాములోరికి ఆభరణాలు 

తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారాముల వారికి అతి ఖరీదైన స్వర్ణాభరణాల కానుకలు వచ్చాయి. ఆ  దేవస్థానం చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 13.50 కిలోల బంగారంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు.

ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం. ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.

భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు లేకపోవడం గమనార్హం. 

Related Posts