YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

నష్టాలతో మార్కెట్ల క్లోజ్

Highlights

✺ నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. యస్ బ్యాంక్ 3 శాతం పెరిగింది.
✺ అదేసమయంలో బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఐషర్ మోటార్స్, యూపీఎల్ షేర్లు నష్టపోయాయి. బీపీసీఎల్ షేరు దాదాపు 3 శాతం పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు ఎక్కువగా పడిపోయాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ రియల్టీ మినహా మిగతా సూచీలన్నీ నష్టాల్లోనే ఉండిపోయాయి.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.24 శాతం పెరుగుదలతో 66.55 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.15 శాతం పెరుగుదలతో 60.61 డాలర్లకు ఎగసింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. 7 పైసలు నష్టంతో 71.27 వద్ద కదలాడుతోంది.

నష్టాలతో మార్కెట్ల క్లోజ్

నష్టాలతో మార్కెట్ల క్లోజ్
ముంబై, డిసెంబర్ 24,
దేశీ స్టాక్ మార్కెట్ మళ్లీ నిరుత్సాహపరిచింది. బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండో రోజు కూడా నష్టపోయాయి. ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. మంగళవారం రోజంతా దాదాపు ఫ్లాట్‌గానే ట్రేడైన సూచీలు చివరి గంటలో నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లలో నష్టాలతో సూచీలపై ఎఫెక్ట్ పడింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 220 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా 12,202 పాయింట్ల కనిష్టానికి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 181 పాయింట్ల నష్టంతో 41,461 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 12,215 వద్ద క్లోజయ్యాయి. ఆటోమొబైల్, ఫైనాన్షియల్ షేర్ల లాభాలను బ్యాంకింగ్, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు హరించేశాయి.
 

Related Posts