ఇంగ్లాండ్ లో బస్సులో సెక్స్...
లండన్, డిసెంబర్ 24,
వాళ్లకు అదేం పాడు రోగమో.. నాలుగు గోడల మధ్య జరగాల్సిన శృంగారాన్ని నడి రోడ్డు మీదే కానిచ్చేశారు. బస్సులో విండో సీటు వద్ద కుర్చిని అందరికీ కనిపించేలా రతి క్రీడలో మునిగితేలారు. అలాంటి పాడుపని కంటికి చిక్కితే జనాలు ఊరుకుంటారా? ఇదిగో ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే, అది క్షణాల్లో వైరల్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమైంది.ఈ షాకింగ్ ఘటన ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో చోటుచేసుకుంది. డబల్ డెక్కర్ (135P) బస్సులో పై అంతస్తులో కుర్చున్న ఓ జంట ఈ పాడుపనికి పాల్పడింది. జాన్ డోలన్ అనే ఒక గ్యాస్ ఇంజనీర్ తన వ్యాన్‌లో అతడి స్నేహితుల కోసం వేచిచూస్తున్నాడు. డోలన్ ఎదురుగా ఆగిన ఆ డబుల్ డెక్కర్ బస్సును చూశాడు. బస్సుపై అంతస్తులో ఒక జంట అతడికి తేడాగా కనిపించారు. సీట్లో కుర్చున్న అబ్బాయి ఒడిలో కుర్చున్న ఆమె పైకి కిందకి ఊగడం చూసి.. ఇదేదో తేడా వ్యవహారంలా ఉందే అని తన మొబైల్ కెమేరా ఆన్ చేసి రికార్డు చేశాడు. దాన్ని జూమ్ చేసి పరిశీలనగా చూసి షాకయ్యాడు. ఓర్నాయనో.. వీళ్లు బస్సులోనే పనికానిచ్చేస్తున్నారే అని ఆశ్చర్యపోయాడు. ఇంత మంచి వీడియోను సోషల్ మీడియాలో పెట్టకపోతే ఎలా అనుకున్నాడో ఏమో.. ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇంకేముంది.. శృంగారం అనగానే జనాలు ఎగబడి మరీ ఆ వీడియో చూశారు. దాన్ని బాగా వైరల్ చేశారు.
వాళ్లు ఆ పని చేస్తున్నప్పుడు బస్సులో ఎవరూ లేరని అనుకుంటే పొరపాటే. ఆ సమయంలో సుమారు 30 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరి పాడుపనిని చూసినా.. చూసి చూడనట్లు వదిలేశారు. వీరి శృంగార యాత్ర దాదాపు 20 కిలోమీటర్ల వరకు సాగినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. ఆ బస్సు వెళ్లే మార్గంలో చాలామంది వారిని చూశారని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసినవాళ్లు పట్టపగలే ఇదేం పాడుపని అని తలలు పట్టుకుంటున్నారు. అంతగా ఆగలేకపోతే ఎక్కడైనా దిగిపోయి.. రూమ్ తీసుకుని చేసుకోవచ్చుగా అని అంటున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 5.67 లక్షల మంది చూశారు. ఈ వీడియో డోలన్ స్పందిస్తూ.. బస్సు స్టాప్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళ ఆ జంటను చూసి షాకైంది. ఎలా స్పందించాలో తెలియక ముఖం తిప్పుకుంది. ఆ బస్సు వెళ్లే దారిలో హైస్కూళ్లు కూడా ఉన్నాయి. వీరి పాడుపని విద్యార్థులు చూస్తే దరిద్రంగా ఉంటుందని తెలిపాడు