YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి వింతలు తెలంగాణ

కరీంనగర్ లో ఇద్దరు అబ్బాయిల పెళ్లి

కరీంనగర్ లో ఇద్దరు అబ్బాయిల పెళ్లి

కరీంనగర్ లో ఇద్దరు అబ్బాయిల పెళ్లి
కరీంగనగర్, డిసెంబర్ 24,
వారిద్దరూ అబ్బాయిలు.. అయినా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరువురి ఒప్పందం ప్రకారం ఆపరేషన్ చేయించుకొని జంటలో ఒకరు మహిళగా మారారు. తర్వాత ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తాను ఎంతో మోజుపడి తాళికట్టిన భాగస్వామిని భర్త వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడా ట్రాన్స్‌జెండర్ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోరాడుతోంది. ఈమెకు ఇతర ట్రాన్స్‌జెండర్లు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది.పెద్దపల్లి జిల్లా బొమ్మారెడ్డి పల్లికి చెందిన యువకుడు కట్టా సంతోశ్. అదే జిల్లా ధర్మారానికి చెందిన అభిషేక్‌ను నాలుగేళ్ల క్రితం కలిశాడు. అభిషేక్‌కు చిన్నప్పటి నుంచి హోర్మోన్ సమతుల్యం సరిగ్గా లేనందున ఆడపిల్ల లక్షణాలుండేవి. వీరి మధ్య స్నేహం అతి కొద్ది వ్యవధిలోనే ప్రేమగా మారిపోయింది. ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. అభిషేక్‌లో హోర్మోన్ అసమతుల్యం గురించి సంతోశ్ అందరికీ చెప్పేయడంతో అందరూ అతణ్ని తేడాగా చూడడం మొదలుపెట్టారు. దీంతో సంతోశ్‌కు దూరం అవ్వాలని అభిషేక్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నిందలు ఎదుర్కొన్నందుకు అభిషేక్‌ను క్షమాపణలు కోరి, కొత్త జీవితం అందిస్తానని సంతోశ్ నమ్మించాడు. ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారితే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీని ప్రకారం అభిషేక్ ట్రాన్స్ జెండర్‌గా మారి అర్చన అయ్యాడు.గత అక్టోబరులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ అర్చనను కొంతకాలానికి వదిలేశాడు. అయితే, సంతోశ్ ఎందుకు ఇలా ప్రవర్తించాడో తనకు తెలీదని బాధితురాలు అర్చన ఆవేదన వ్యక్తం చేస్తోంది. వదిలేసి వెళ్లిపోవడమే కాక, సంతోశ్ తనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నాడని అర్చన ఆరోపిస్తోంది. సంతోశ్‌ తనను చేరదీయాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం అర్చన పోరాటం చేస్తోంది. ఈమెకు ట్రాన్స్ జెండర్లు కూడా సహకారం అందిస్తున్నారు. అభిషేక్ జీవితంలోకి వచ్చిన సంతోశ్ అతణ్ని మోసం చేసి, అర్చనలా మార్చడమే కాక చివరికి మొహం చాటేశాడని ట్రాన్స్ జెండర్లు మండిపడుతున్నారు.

Related Posts