మూడు రాజధానులను స్వాగతిస్తున్నారు
తాడేపల్లి డిసెంబర్ 18
టీడీపీ నాయకుల స్పాన్సర్డ్ ఉద్యమం చేయిస్తున్నారు. టీడీపీ మీడియా రాజధాని విషయంలో అతిగా చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్యమాలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఉండడం ఇష్టం లేదని సచివాలయం ఉద్యోగులే చెపుతున్నారు. చంద్రబాబు అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పి రైతులని మోసం చేశారు. రాజధానిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. తమ బినామిలు కొన్న భూములుకు రేట్లు పలకడం కోసం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. ధర్నాలు చంద్రబాబు కు వ్యతిరేకంగా చేయాలి. చంద్రబాబు రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఉంటే రాజధాని తరలించే పరిస్థితి వచ్చేది కాదని అయన అన్నారు. ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారు. రాజధాని ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరగనివ్వమని ప్రభుత్వం చెపుతుంది. తెలుగు భాష కోసం రాయలసీమ ప్రజలు రాజధానిని కోల్పోయారని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హై కోర్ట్ రాయలసీమలో ఏర్పాటు చేయాలి. లక్ష 70 వేల కోట్లు అప్పు తెచ్చి కేవలం ఐదు వేల కోట్లు రాజధానికి చంద్రబాబు ఖర్చు చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదా. ప్రపంచ స్థాయి రాజధాని చంద్రబాబు నిర్మిస్తాము అంటేనే జగన్మోహన్ రెడ్డి అమరావతి కి మద్దతు తెలిపారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చందాలు వసూళ్లు చేసి రాజధానిలో ఉద్యమాన్ని అమరావతిలో నడిపిస్తున్నారు. ఎల్లో మీడియా రాజదానిపై అసత్య ప్రచారాలు చేస్తోంది. మూడు లక్షల కోట్ల అప్పుతో మరొక లక్ష కోట్లు అప్పు చేస్తే రాజధాని నిర్మిస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమి కావాలి.-ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్ ను రాజధానిగా చేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలు కతీతంగా ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారు. కె ఈ, గంటా, చిరంజీవి, జీవిఎల్ వంటి వారు జిఎన్ రావు కమిటీని స్వాగతిస్తున్నారు. ప్రజలు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం క్యాబినెట్ నిర్ణయం తరువాత వస్తుందని అయన అన్నారు.