YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మౌనమే అటల్జీ ఆయుధం

మౌనమే అటల్జీ ఆయుధం

మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నేతకు నివాళులు అర్పించారు. మూడు సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయికి ఆయన మాటల కంటే మౌనమే శక్తివంతమైనదని ప్రధాని కొనియాడారు. ఎప్పుడు మౌనం దాల్చాలి..ఎప్పుడు మాట్లాడాలి అనేది ఆయనకు తెలుసునన్నారు. వాజ్‌పేయికి నివాళులు అర్పిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.  వాజ్‌పేయికి నివాళులు అర్పిస్తూ దివంగత ప్రధానితో తాను పలు సందర్భాల్లో కనిపించిన దృశ్యాలను ఆ వీడియోలో పొందుపరిచారు. ఇక అంతకుముందు బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు నేతలు దివంగత నేత వాజ్‌పేయికి అటల్‌ సమాధి స్ధల్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. 1924, డిసెంబర్‌ 25న జన్మించిన వాజ్‌పేయి 1939లోనే ఆరెస్సెస్‌లో చేరారు.

Related Posts