Highlights
- భద్రాద్రి తరహాలోనే రాములోరి పెళ్లి
- ప్రభుత్వ లాంచనాలతో
- ముత్యాల తలబ్రాలు
- పట్టుపీతాంబరాలను సమర్పణ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో గొల్ల మామిడాడ ప్రసిద్ధి చెందిన కోదండ రామాలయం ఉంది. ఈ రామాలయం ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటుంది. 9 అంతస్తులతో గోపురం ప్రతీ అంతస్తు నుంచీ చెక్కిన పురాణ గాధలను చూడవచ్చు రామాయణ భారత భాగవత ఘట్టాలు కళ్ళకి కట్టినట్లు మలిచారు.
రామాలయానికి రెండు గోపురాలున్నాయి. పెద్ద గోపురంలో పదమూడు అంతస్తులున్నూ, చిన్నగోపురం ఎనిమిది అంతస్తుల ఎత్తూ ఉన్నాయి. తూర్పు దిక్కున గోపురం 200 అడుగుల ఎత్తు కలిగి గోపురం చివరి అంతస్తు ఎక్కితే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురం లో ఉన్న పాండవుల మెట్ట కనబడుతుంది.20 కిలోమీటర్ల లో ఉన్న కాకినాడ కనబడుతుంది.గోపురాలకు తోడు రామాలయంలో అద్దాల మందిరం మరొక ఆకర్షణ. మొదటి అంతస్తులో రామ పట్టాభిషేక అనంతరం తనకు రావణవధ కై సహాయ పడిన వానర వీరులగు సుగ్రీవాదులకు సత్కారము చేయు సమయమున ఆంజనేయునకు రత్నాల హారమును బహూకరించగా, అందులోని రత్నములలో రామ నామమును ఆంజనేయుడు వెతుకు కొను ఘట్టమును శిల్పులు చిత్రకరించిన దృశ్యమును, అద్దాల మేడలో అతి రమ్యముగా పొందు పరచారు. గాజు అరలలో అమర్చిన సీతారామ విగ్రహాలు, సింహాసనము మొదలగు వానిని అద్దముల ద్వార చూచినచో ఊయల ఊగు చున్నట్లుగాను, సీత రాములు సింహాసనములో కుర్చున్నట్లుగాను చూపరులకు అనిపించును.ఇదే ఆ అద్దముల అమరిక ప్రత్యేకాకర్షణ.శ్రీరామనవమి, రథసప్తమిల సందర్భంగా మామిడాడలో సంవత్సరానికి రెండు సార్లు తిరునాళ్ళు జరుగుతాయి.
భద్రాచలం తరువాత అంతటి వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు మామిడాడలోనే జరుగుతాయని ప్రతీతి.భద్రాచలంలో లాగానే ఇక్కడ కూడా రాములవారి కల్యాణం ప్రభుత్వ లాంచనాలతో.ఘనంగా ముత్యాల తలబ్రాలు పట్టుపీతాంబరాలతో జిల్లా కలెక్టర్ సమర్పిస్తాడు .ఈ కోదండ రామాలయం చూడటం ఒక మధురానుభూతిగా భక్తులు భావిస్తారు.