YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

 జిల్లాల్లో అక్రమ రేషన్ బియ్యం  దందా

 జిల్లాల్లో అక్రమ రేషన్ బియ్యం  దందా

 జిల్లాల్లో అక్రమ రేషన్ బియ్యం  దందా
ఖమ్మం, డిసెంబర్ 26,
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లాయిగూడెంలో 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు దాడిచేసి సీజ్‌చేశారు. కూసుమంచి పోలీసులు లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాకినాడకు చెందిన లోవరాజుకు ఖమ్మం జిల్లాకు చెందిన సత్యనారాయణ అనుచరుడిగా పనిచేస్తున్నట్టు తెలిసింది. పదిహేను రోజుల కిందట కూడా సత్యానారాయణ లారీలో బియ్యం తరలిస్తుండగా పట్టుబడింది. 30 రైస్ మిల్లులు కలిగి ఉన్న లోవరాజు జిల్లాకు ఒక వ్యక్తిని నియమించుకొని ఈ దందా కొనసాగిస్తున్న ట్టు సమాచారం. ఏపీ, తెలంగాణలో లోవరాజు పెద్దఎత్తున మాఫియా ముఠాను కొనసాగిస్తున్నాడని పోలీసులు విచారణలో వెలుగుచూసింది. అక్రమం గా తరలించిన బియ్యాన్ని లోవరాజు తన 30 రైస్‌మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి కాకినాడ పోర్టు ద్వారా ఇతర రాష్ర్టాలకు, దేశాలకు తరలిస్తున్నాడని విచారణలో వెలుగుచూసింది. పదేండ్లుగా లోవరాజు ఈ అక్రమదందాకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తినట్టు పోలీసులు తెలిపారు. ఐదేండ్లుగా ఖమ్మం జిల్లాకు చెందిన సత్యనారాయణ కూడా జతకట్టి ఇక్కడి నుంచి సబ్సి డీ బియ్యాన్ని తరలిస్తున్నట్టు తేలింది. రేషన్ బియ్యం కొనుగోలు కోసం ప్రతీ జిల్లాల్లో రహస్యంగా ఓ కొనుగోలు కేంద్రాన్ని ఈ మాఫియా బృందం ఏర్పాటు చేసుకొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఒక్కసారి పెద్దఎత్తున లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వేళలో తరలిస్తున్నారు. రేషన్ మాఫియా సగటున నెలకు మూడు వేలల కిలోల చొప్పన బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నది. ప్రభుత్వం లబ్ధిదారులకు కిలో బియ్యం రూపాయికే అందించేందుకు రూ.28 ఖర్చుపెడుతున్నది. ఈ లెక్కన ఏడాదికి రూ.10 కోట్ల విలువైన బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నది.

Related Posts