YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 ఎంతెంత దూరం... బస్టాండ్ నిర్మాణం

 ఎంతెంత దూరం... బస్టాండ్ నిర్మాణం

 ఎంతెంత దూరం... బస్టాండ్ నిర్మాణం
అదిలాబాద్, డిసెంబర్ 26,
ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో చేపట్టిన ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాల్సిన ఆర్టీసీ అధికా రులు తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో పనులు దక్కించుకున్న గుత్తేదారు తన ఇష్టా రాజ్యాంగా చేపడుతున్నారు. ఫలితంగా బస్టాండ్‌కు వచ్చే ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుండగా అసంపూర్తి నిర్మాణాలు అధికారుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ఏళ్ళక్రితం నిర్మించబడింది. అప్పటి బస్సుల సంఖ్యకనుగుణంగా ఫ్లాట్‌ఫా మ్‌లను నిర్మించారు. జిల్లాకేంద్రమైన ఆదిలాబాద్ పట్టణానికి నియోజవర్గంలోని వందలాది గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రతినిత్యం వేలాది మంది ప్రయాణీకులు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. గతంతో పోల్చితే ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగింది. వారి సంఖ్యకనుగుణంగా అధికారులు బస్సులను సైతం పెంచారు. అయితే ప్రస్తుతమున్నటువంటి ప్లాట్‌ఫాంలు పెరిగిననా ప్రయాణీకుల సంఖ్యకనుగుణంగా సరిపోవడంలేదు. వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు బస్టాండ్‌లో ఉన్నా వారిని తరలించేందుకు అవసరమైన బస్సులను నిలిపేందుకు అవకాశం లేకుండా పోతోంది.ఫ్లాట్‌ఫాంలో ఉన్న బస్సు కదిలితే తప్ప మరో బస్సు తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో ప్రయాణీకులు బస్టాండ్‌లోనే నిరీక్షించాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులన్నింటిని దూరం చేయాలనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ అధికారులు ఫ్లాట్‌ఫాంలను విస్తరించాలని నిర్ణయించి అందుకు అవసరమైన నిధులను విడుదల చేసారు. బస్టాండ్‌లో చేపట్టిన విస్తరణ పనులకు అప్పటి రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో కలిసి భూమిపూజ చేశారు. ప్రస్తుతమున్న ప్లాట్‌ఫాంలకు అదనంగా మరో ఐదు ఫ్లాట్‌ఫాంలను కొత్తగా నిర్మించాలని సంకల్పించిన అధికారులు ఆపనులకు టెండర్లను పిలిచారు. పనులను దక్కించుకున్న గుత్తేదారు నత్తనడకన పనులు చేపడుతున్నారు. పనుల ప్రారంభం నుంచి ఇప్పటివరకు అదే వైఖరిని అవలంబిస్తుండటంతో పనుల ప్రగతిలో ఏమాత్రం ముందడుగు పడటంలేదు. ప్రస్తుతం ఫ్లాట్‌ఫాంల విస్తీరణ పనులు స్లాబ్‌దశకు చేరుకున్నాయి. స్లాబ్‌వేసి నెలలు గడుస్తున్నా మిగతా ఆధునీకరణ పనులను అలాగే వదిలే యడంతో అసంపూర్తిగానే మిగిలిపోయాయి. పూర్తిస్థాయిలో పనులు కానప్పటికి బస్సులను మాత్రం కొత్త ప్లాట్‌ఫాంలపై నిలుపుతున్నారు.దీంతో పనులను పూర్తిచేయించడంలో విఫలమైన ఆర్టీసీ అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్‌ఫాంల వద్ద తాత్కాలికంగా కుర్చీలను వేయించారు. పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో  కాంక్రిట్ కుప్పలు బస్సులు ఎక్కే ప్రాంతం 

Related Posts