YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

మా కొద్దు మద్యం వంటున్న అన్నెపర్తి గ్రామస్తులు

మా కొద్దు మద్యం వంటున్న అన్నెపర్తి గ్రామస్తులు

మా కొద్దు మద్యం వంటున్న అన్నెపర్తి గ్రామస్తులు
నల్గొండ, డిసెంబర్ 26,)
మద్యం బడుగుల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. పచ్చని సంసారాల్లో పెనువిషాదం నింపుతోంది. మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువకుల సంఖ్య భారీగానే ఉంటుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే అలాంటి భూతాన్ని.. తమ ఊళోకి రానీయకూడదని ఆ గ్రామస్తులు తీర్మానించారు. అందరినీ ఏకతాటిపై నిలిపి.. మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్నారు. అంతకు ముందు ఏం చేస్తున్నారో స్పృహ ఉంటుంది. కానీ మద్యం తాగిన తర్వాత విచక్షణ కోల్పోతారు. ఏం చేస్తున్నారో సోయి ఉండదు. నేరానికి పాల్పడితే శిక్ష పడుతుందనే భయముండదని నిపుణులు వివరిస్తున్నారు. హద్దుమీరిపోతున్న లిక్కర్‌ దందాతో అనేక దారుణాలు వెలుగు చూస్తున్నాయి.  మద్యపానంతో ఆర్థికంగా... శారీరకంగా... మానసికంగా... సామాజికంగా నష్టపోతున్నామని గ్రహించిన అన్నెపర్తి గ్రామస్తులు సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలంలోని అన్నెపర్తి  గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ గ్రామంలో జనవరి 1నుండి ఎవరైనా మధ్యం అమ్మితే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గ్రామంలో మధ్యం అమ్మడం, తాగడం వంటివి చేస్తే భారీ జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. మద్యం తాగితే మనిషికి మృగానికి తేడా ఉండదనడానికి ఇటీవల నగరంలో జరిగిన ఘటనలే నిదర్శనాలు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి స్పృహ లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణాలు తమ గ్రామస్తులు చేయకుండా... మద్యనిషేధం చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. గతంలో మద్యానికి బనిసలై సుమారు 30 మంది మరణించారు. అనేక కుటుంబాలు వీదిన పడ్డాయి. దీంతో మూకుమ్మడిగా మద్యం నిషేధించాలని తీర్మారం చేశారు. అన్ని అనర్థాలకు కారణమైన మద్యాన్ని గ్రామంలోకి రానికుండా చూడాలని గ్రామస్తులు బావిస్తున్నారు. వచ్చే ఎడాది జనవరి 1 నుంచి గ్రామంలో మద్య నిషేధం అమలు చేయాలని హెచ్చరించారు. ఇందుకు పోలీసుల సహకారం కూడా కోరారు. గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని అనేక మందికి అవగాహన కల్పింస్తున్నారు. అక్రమంగా మద్యం విక్రయించే వారిని అదుపు చేయడానికి కొంత మంది దాతలు సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. దీంతో అన్నెపర్తి గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధంవైపు అడుగులు పడుతున్నాయి. అన్నెపర్తి గ్రామస్తుల నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నెపర్తి గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకోని అన్ని గ్రామాలు ముందుకోస్తే.... యువత పెడదారి పట్టకుండా మంచి సమాజం నిర్మితం చేయవచ్చని పలువురు సూచిస్తున్నారు. 

Related Posts