YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెలుగు భాష ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది: ఉపరాష్ట్రపతి

తెలుగు భాష ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది: ఉపరాష్ట్రపతి

తెలుగు భాష ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది: ఉపరాష్ట్రపతి
రాజమండ్రి డిసెంబర్ 26
: బ్రిటిష్ వారు భారత దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ల భాష అయిన ఇంగ్లీషును మనకు నేర్పారని, కానీ.. వాళ్లు మన తెలుగు భాషను నేర్చుకోలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజమండ్రిలో డెల్టా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతూ... మాతృభాషను మర్చిపోకూడదనే విషయాన్ని గుర్తు చేశారు. ఇంగ్లీషును తప్పని సరిగా నేర్చుకోవాలని సూచించారు. ఏపీలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బోర్డుల్లో తెలుగు భాష ఉండాలని, మాతృభాషను మనం రక్షించుకోవాలని ఉద్ఘాటించారు. తెలుగు భాష ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని తెలియజేశారు. వైద్య రంగంలో భారతదేశం ప్రపంచంలోనే ముందంజలో ఉందని, పేరెన్నికగన్న దేశాల్లో భారతీయ వైద్యులే కీలకంగా ఉన్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. వైద్య రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలని, సరసమైన ధరలకే స్వచ్ఛమైన వైద్యం ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాలకు అత్యాధునికి వైద్యం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. నదుల అనుసంధానం ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని, గోదావరి జిల్లాల్లో పుష్కలంగా నీరు ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతోందని ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.

Related Posts