YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతి స్పెషల్స్‌కు ఆర్టీసీ కసరత్తు  రీజియన్‌వ్యాప్తంగా 360 బస్సుల ఏర్పాటుకు ప్రణాళికలు  జనవరి 9 నుంచి స్పెషల్‌ బస్సులు ప్రారంభం

సంక్రాంతి స్పెషల్స్‌కు ఆర్టీసీ కసరత్తు  రీజియన్‌వ్యాప్తంగా 360 బస్సుల ఏర్పాటుకు ప్రణాళికలు  జనవరి 9 నుంచి స్పెషల్‌ బస్సులు ప్రారంభం

సంక్రాంతి స్పెషల్స్‌కు ఆర్టీసీ కసరత్తు 
రీజియన్‌వ్యాప్తంగా 360 బస్సుల ఏర్పాటుకు ప్రణాళికలు 
జనవరి 9 నుంచి స్పెషల్‌ బస్సులు ప్రారంభం
గుంటూరు డిసెంబర్ 26
మూడురోజులు జరుపుకొనే సంక్రాంతి పర్వదినానికి ఆర్టీసీ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. సంక్రాంతి పండుగ రద్దీని అదనపు ఆదాయంగా సమకూర్చుకునేందుకు అధికారులు ఇప్పటికే ప్రత్యేకప్రణాళికలు రూపొందించారు. రీజియన్‌ నుంచి మొత్తం 360 అదనపు బస్సుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జనవరి 9 నుంచి స్పెషల్‌ బస్సులను ప్రారంభించనున్నట్లు రీజనల్‌ మేనేజర్‌ సుమంత్‌ ఆర్‌ ఆదోని తెలిపారు. సాధారణ షెడ్యూల్‌ సర్వీసులు ఫుల్‌ అయిపోవటంతో ఆయా రూట్లలో అదనపు సర్వీసులను ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు నుంచి హైదరాబాద్‌ రాకపోకలకు 333 అదనపు బస్సులు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. బెంగళూరుకు 10, చెన్నైకు మరో 15సర్వీసులు అందుబాటులో ఉంచుతున్నారు. జనవరి 9నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు ప్రయాణికులను తీసుకొచ్చేందుకు స్పెషల్‌సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. తిరుగు ప్రయాణికుల కోసం జనవరి 16వ తేదీ నుంచే స్పెషల్‌ బస్సులు సిద్ధం చేస్తామన్నారు. పండుగ ముగిసిన తరువాత శని, ఆదివారాలు అదనపు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. రిజర్వేషన్‌ సౌకర్యం అమల్లోకి : సంక్రాంతి పర్వదినానికి సంబంధించి ఆర్టీసీ ఏర్పాటు చేసిన స్పెషల్‌ బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే సాధారణ షెడ్యూల్‌ బస్సులు జనవరి 10, 11, 19వ తేదీల్లో ఫుల్‌ అయిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆయా రూట్లలో అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.

Related Posts