YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 అభివృద్ధి పథం (మెదక్)

 అభివృద్ధి పథం (మెదక్)

 అభివృద్ధి పథం (మెదక్)
జహీరాబాద్, డిసెంబర్ 26: పట్టణంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడంతో ఇబ్బందులు దూరం కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీటిని తర్వగా ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నారు. జహీరాబాద్‌ పట్టణం నుంచి తాండూరు వెళ్లే ప్రధాన రహదారిపై రామ్‌నగర్‌ ఉంది. మొగుడంపల్లి- చించోళీ వెళ్లే ప్రధాన రహదారిపై చిన్నహైదరాబాద్‌  ఉంది. పట్టణానికి సమీపంలో ఒకే పంచాయతీ పరిధిలో ఉన్న వీటిని ఇటీవల జహీరాబాద్‌ పురపాలకలో విలీనం చేశారు. ఈ రెండింటి మధ్య దూరం కేవలం రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది. అయినా సరైన దారి లేక జహీరాబాద్‌ పట్టణం మీదుగా తిరిగి వెళ్లడంతో దాదాపు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అవుతుంది. దీనికి తోడు పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య వల్ల రాకపోకలకు జాప్యం జరుగుతోంది. తాత్కాలిక రోడ్డుపై నుంచి చిన్న వాహనాలు వెళుతున్నప్పటికీ వర్షాకాలంలో సాధ్యపడటం లేదు. దీంతో పట్టణం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం రూ.80 లక్షలతో చేపట్టనున్న తారు రోడ్డు పనులు త్వరగా పూర్తైతే ఇబ్బందులు తీరుతాయి. అంతేగాకుండా రెండు గ్రామాలతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు రైల్వే గేటు తగల కుండా జాతీయ రహదారి, ఇతర గ్రామాలకు వెళ్లేందుకు వెసులు బాటు కలుగుతుంది. జహీరాబాద్‌ నడి పట్టణంలో విశాలమైన స్థలంలో 1982లో జూనియర్‌ కళాశాల భవనాన్ని నిర్మించారు. రెండు అంతస్తుల అతి పెద్ద భవనంలో 32 గదులు నిర్మిచగా ఉమ్మడి మెదక్‌తో పాటు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. నిర్వహణ కొరవడటంతో భవనం శిథిలావస్థకు చేరింది. అధ్యాపకులు తగ్గిపోవటం, కనీస సదుపాయాలు కొరవడటం తదితర సమస్యలు చుట్టుముట్టాయి. ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఏడాది  తెలుగు, ఉర్దూ మాధ్యమం, ఓకేషనల్‌ కోర్సులు ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కలిపి 1200 విద్యార్థులున్నారు. సరిపడ గదులు లేకపోగా, ఉన్న భవనం శిథిలావస్థకు చేరడంతో అధ్యాపకులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోడలు బీటలు పడటం, కొన్ని గదు]ల పైకప్పు పెచ్చులు ఊడిపోయాయి. గోడలు, కిటికీల ఫర్నిచర్‌ దెబ్బతిన్నాయి. రంగులు వేయక పోవటంతో కళావిహీనంగా తయారయ్యాయి. ఇక్కడ కొత్త భవన నిర్మాణానికి సీఎస్‌ఆర్‌ నిధులు రూ.1.50 కోట్లు కేటాయించారు. వీటితో సగం భవనం  పూర్తయ్యే అవకాశం లేదని ఇంకా అదనంగా డబ్బుల అవసరం ఉందని స్థానికులు కోరడంతో అదనంగా మరో రూ.1.50 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్‌లో సరియైన కాల్వలు, అంతర్గత రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత పట్టణంలో ఏళ్ల కిందట నిర్మించిన  కాల్వలు ధ్వంసమైపోగా, దారులు అధ్వానంగా మారాయి. కొన్ని చోట్ల పైపులైన్ల గుంతలు, మరికొన్ని చోట్ల వాహనాల తాకిడి, వర్షానికి ఏర్పడిన గుంతలతో అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడు కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లో  ఇదే దుస్థితి. రూ.10కోట్ల నిధులు రావడంతో సమస్యలు పరిష్కారం కానున్నాయనిఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts