Highlights
- బాగ్దాద్ నుంచి పెద్ద గురువు పంపిన షాదర్‌ను స్వీకరించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన అజ్మీర్ లో ఖాజా మొయినుద్దీన్ దర్గాకు షాదర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహూకరించారు. శనివారం అజ్మీర్ లో ఉరుసుకు వెళుతున్న ముస్లిం మత పెద్దలు సచివాలయంలో సీఎంని కలసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తికావాలని మత పెద్దలు ప్రార్ధించారు. చంద్రబాబుకు ముస్లింల సంపూర్ణ మద్దతు ఉంటుందన్న మైనారిటీ నేతలు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మైనారిటీల పక్షాన ముఖ్యమంత్రిని కలసిన నాయకులు ఎం.హెచ్ రహమాన్, ఎస్.ఎం ఫైజాన్, ఎండీ బేగ్, ఎండీ సల్మాన్, ఎ. మబూద్, అస్గర్ షరీఫ్, ఎస్.కె అమానుల్లా, ఎస్.ఎం జావేద్ , కరీముల్లా, ముఫ్తి తదితరులు పాల్కొన్నారు.