ఆపద సమయాల్లో అండగా ఉంటాం - జిల్లా ఎస్పి శ్వేతారెడ్డి
- సురక్షిత కామారెడ్డి అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్ ,ఎస్పీ
కామారెడ్డి డిసెంబర్ 26
కామారెడ్డి జిల్లా ను సురక్షితంగా ఉంచాలన్న ఉద్దేశంతో సురక్షిత కామారెడ్డి పేరుతో ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు, ముఖ్యంగా మహిళలు విపత్కర సమయాలలో తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని 100 కు ఫోన్ చేస్తే చాలని ఆదుకోవడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి సూచించారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలోని గ్రంథాలయ భవనం లో ఏర్పాటుచేసిన సురక్షిత కామారెడ్డి అవగాహన సదస్సులో ఎస్పి మాట్లాడారు, అవగాహన సదస్సుకు హాజరైన ఉద్యోగులతో సురక్షిత కామారెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.అన్ని శాఖల సమన్వయంతో ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సురక్షిత కామారెడ్డి కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని ఉద్యోగులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, పోలీసు శాఖ తో పాటు పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.