YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధానిపై కేబినెట్ నిర్ణయం

రాజధానిపై కేబినెట్ నిర్ణయం

రాజధానిపై కేబినెట్ నిర్ణయం
విశాఖకు 394 కోట్లు
విజయవాడ, డిసెంబర్ 26,
జగన్ సర్కార్ విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎంపిక చేయనుందని ప్రచారం జరుగుతున్న వేళ ఏపీ ప్రభుత్వం విశాఖకు నిధుల వరద పారించింది. విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భారీగా నిధులు విడుదల చేసింది. బీచ్ రోడ్డు.. వాణిజ్య సముదాయాలు తదితర పనుల కోసం రూ.394 కోట్లు విడుదల చేసింది. దీంతో ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రచారానికి బలం చేకూరినట్లైంది.విశాఖలోని ప్రముఖ దర్శనీయ ప్రదేశం కైలాసగిరి ప్లానెటోరియం నిర్మాణానికి రూ. 37 కోట్లు, కాపులుప్పాడ బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్‌కి రూ. 22.50 కోట్లు, సిరిపురం జంక్షన్ లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్ కోసం రూ. 88 కోట్లు, చుక్కవానిపాలెం రహదారికి రూ. 90 కోట్లు కేటాయించింది.అలాగే విశాఖలో ఏర్పాటు చేయనున్న మ్యూజియం, బీచ్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించనున్న భూగర్భ పార్కింగ్‌కి మరో రూ. 40 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్డు నిర్మాణానికి కోసం 75 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది.ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించనున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖకు నిధుల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Posts