YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ విదేశీయం

ఈజిప్టు నుంచి వచ్చిన ఉల్లి

ఈజిప్టు నుంచి వచ్చిన ఉల్లి

ఈజిప్టు నుంచి వచ్చిన ఉల్లి
హైద్రాబావ్, డిసెంబర్ 27,
హారంలో అతి ముఖ్యమైన నిత్యావసర సరకు ఉల్లి ధర ఆకాశాన్నంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెరిగిన ధరలకు సామాన్యులు దీన్ని కొనలేకపోతున్నారు. నిత్యం వంటకాల్లో దీన్ని బాగా తగ్గించి వాడుకుంటుండడం దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అది మిశ్రమ ఫలితాలనే ఇస్తోంది. కిలో రూ.వందకు తక్కువ లేకుండా బయట మార్కెట్లో అమ్ముతున్న ఉల్లిని రైతు బజార్లలో రూ.40కే విక్రయిస్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఈ కసరత్తు చేస్తోంది. వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ధరల భారం నుంచి సామాన్యులను రక్షించేందుకు ఉల్లిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈజిప్టు నుంచి ఇప్పటికే వచ్చిన 100 క్వింటాళ్ల ఉల్లి ఇప్పుడు నగరంలోని 11 రైతు బజార్లలో అమ్ముతున్నారు. ఈ మేరకు రాయితీపై ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు.ఈజిప్టు నుంచి వస్తున్న ఉల్లిని నగరంలోని అన్ని రైతు బజార్లలో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఇందుకోసం 500 మెట్రిక్‌ టన్నుల సరకును దిగుమతి చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దశలవారీగా వచ్చే సరకును తర్వాత అన్ని జిల్లాలకు పంపిస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి తెప్పించిన ఉల్లిని నగరంలో తొలిసారిగా అమ్ముతున్నట్లు వారు తెలిపారు.ఈజిప్టు నుంచి వచ్చిన ఉల్లి పెద్ద సైజులో, ఎరుపు రంగులో, ఆకర్షణీయంగా కనిపిస్తుండడం, కిలో రూ.40కే లభిస్తుండడంతో కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. అధికారుల పర్యవేక్షణలో రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 వరకు ప్రత్యేకంగా ఈ ఉల్లిని విక్రయిస్తున్నారు.

Related Posts