YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 విశాఖే పరిపాలనా కేంద్రమే

 విశాఖే పరిపాలనా కేంద్రమే

 విశాఖే పరిపాలనా కేంద్రమే
విశాఖపట్టణం, డిసెంబర్ 26, 
విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఖాయమయ్యింది. శుక్రవారం జరిగే ఏపీ కేబినెట్ సమావేశానికి ముందే వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖలోనేనని సంకేతాలు ఇచ్చారు. గురువారం కలెక్టర్ అధికారులతో సమీక్ష చేసిన విజయసాయిరెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన తర్వాత తొలిసారి శనివారం నగరానికి రాబోతున్నారని.. కాబట్టి సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.శనివారం విశాఖకు వస్తున్న జగన్‌కు 24 కిలోమీటర్ల మేర సీఎం జగన్‌కు స్వాగతం చెబుతామన్నారు విజయసాయిరెడ్డి. చరిత్రలో నిలిచిపోయేలా స్వాగత కార్యక్రమం ఉంటుందని.. దాదాపు మూడు గంటల పాటూ స్వాగత కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాబోయే రోజల్లో విశాఖ నుంచే కార్యక్రమాలు మొదలవుతాయని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.1290 కోట్ల పనులకు శ్రీకారం చుడతారని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే.. విశాఖలో వివాదాస్పద ఆస్తులపై తాను ఏ ఒక్క అధికారికీ ఫోన్ చేసి చెప్పలేదని విజయసాయిరెడ్డి అన్నారు. నగరంలో తన పేరును వాడుకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులకు సూచించారు. విశాఖలో తనకు ఒక్క ప్లాట్ తప్ప ఏమీ లేదని.. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు ఎలాంటి ఆసక్తులతో సంబంధం లేదన్నాు వైఎస్సార్‌సీపీ ఎంపీ.ముఖ్యమంత్రి స్వాగత కార్యక్రమానికి సంబంధించి విజయసాయిరెడ్డి ట్వీట్ కూడా చేశారు. 28న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం.. విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో థాంక్యూ జగనన్నా అంటూ జననేతకు ధన్యవాదాలు చెబుదాం అంటూ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అమరావతి రైతులు మండిపడుతున్నారు. ఏపీ కేబినెట్‌లో చర్చించకుండా ఆయన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని ఎలా ప్రకటిస్తారని ప్రశ్న.

Related Posts