టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభం
తిరుమల డిసెంబర్ 26,
టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో గురువారం మధ్యాహ్నం నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. డిసెంబరు 26వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా టిటిడి స్థానికాలయాలను బుధవారం రాత్రి మూసివేసిన విషయం విదితమే.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని గురువారం మధ్యాహ్నం 12.00 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం చేశారు. అనంతరం 2.00 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని గురువారం మధ్యాహ్నం 12.00 గంటలకు తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.00 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని మధ్యాహ్నం 12.00 గంటలకు తెరచి శుద్ధి, పుణ్యహవచనం చేపట్టారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని మధ్యాహ్నం 12.00 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2.00 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని గురువారం మధ్యాహ్నం 12.00 గంటలకు తెరచి శుద్ధి పుణ్యహవచనం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని గురువారం 4.00 గంటలకు తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. శుద్ధి తరువాత భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మధ్యాహ్నం 12.00 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.