YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సంక్రాంతి తర్వాత మంత్రి వర్గ విస్తరణ

సంక్రాంతి తర్వాత మంత్రి వర్గ విస్తరణ

సంక్రాంతి తర్వాత మంత్రి వర్గ విస్తరణ
బెంగళూర్, డిసెంబర్ 27  
కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో అయితే లేనట్లే. బహుశ సంక్రాంతి తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎంత ప్రయత్నిస్తున్నా కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి దొరకడం లేదు. దీంతో కేంద్ర నాయకత్వంతో చర్చించిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ జరగాల్సి ఉంది. మంత్రివవర్గ విస్తరణలో జాప్యం జరుగుతుండటంతో బీజేపీ సీనియర్ నేతల నుంచి ముఖ్యమంత్రిపై వత్తిడి పెరుగుతోంది.ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. తనను అందలం ఎక్కించిన అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను వీలయినంత త్వరగా మంత్రి వర్గ సభ్యులుగా చూడాలని యడ్యూరప్ప తహతహలాడుతున్నారు. అనర్హత వేటు పడి ఉప ఎన్నికల్లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గ సభ్యులుగా చేర్చుకుంటారని యడ్యూరప్ప ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు కావాలంటే కేంద్ర నాయకత్వం అనుమతి తప్పనిసరి కావాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా బీజేపీ సీనియర్ నేతలు వత్తిడి తెస్తున్నారు. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న తమను కాదని కొత్తగా చేరిన వారికి ఎలా మంత్రి పదవులు ఇస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే హోసదుర్గ బీజేపీ ఎమ్మెల్యే శేఖర్ తనకు కూడా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. తాను పార్టీకి చేసిన కష్టాన్ని గుర్తించాలంటున్నారు. 2008లో బీజేపీ లో చేరిన గుళహట్టి శేఖర్ తాను ఆరోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలో చేరిన విషయాన్ని యడ్యూరప్ప మర్చి పోయా రంటున్నారు.ఇలా మరికొందరు సీనియర్ నేతలు సయితం యడ్యూరప్ప నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీనివల్ల బీజేపీ క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళతాయని సీనియర్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. అవసరమైతే సీనియర్ నేతలందరూ కలసి ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరిగే కొద్దీ యడ్యూరప్పకు ఇబ్బందులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. బీజేపీ నేతల్లో అసంతృప్తి చెలరేగితే దానిని చల్లబర్చడానికి మళ్లీ యడ్యూరప్ప కేంద్రనాయకత్వాన్ని ఆశ్రయించక తప్పదంటున్నారు.

Related Posts