YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతులకు మయసభ చూపించేస్తున్నారు

రైతులకు మయసభ చూపించేస్తున్నారు

రైతులకు మయసభ చూపించేస్తున్నారు
విజయవాడ, డిసెంబర్ 27  
చక్కగా మూడు పంటలను పండించుకుని తామే రాజులుగా రోజులు వెళ్ళదీసే రైతులను రియల్ వ్యాపారం మోజులోకి దింపింది అచ్చంగా చంద్రబాబే. భూమత, గోమాత తల్లితో సమానం. పర్ర భూముల కధ వేరు, అలాంటి పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టడం మహా పాపం. కానీ రాజధాని కోసమంటూ ఆడిన జూదంలో రైతులను ముందు వరసలో నిలెబెట్టేసింది అప్పటి టీడీపీ సర్కార్. పొలాలు ఉన్నవి పంటల కోసం, అన్నం పెట్టడానికి అన్న దాన్ని మరచి బంగారు బాతు గుడ్డుని నిజానికి చంపేసింది నాటి ప్రభుత్వ పాలకులే. ఈ రోజు దేశంలో ఆహర ధాన్యాల కొరత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. అటువంటిది ఉన్న భూములను బీడు చేసుకుని రైతులకు మయసభ చూపించిన నేరం అచ్చంగా చంద్రబాబుదే. చంద్రబాబు ఒక్క రాజధాని పేరు చెప్పలేదు, ఒక్కలా మభ్యపెట్టలేదు, సింగపూరు నుంచి మొదలుపెట్టి బీజింగ్ వరకూ ఎన్నో కధలు చెప్పారు. 2050 వరకూ ప్రణాళికలు వేశారు. అంటే అచ్చంగా మూడున్నర దశాబ్దాలు. ఆనాటికి ఎవరు ఉంటారు, ఎలా ఉంటారన్న ఆలోచన లేకుండా రైతులు అమాయకంగా మోసపోయారంటే కొంత తప్పు వారిలోనూ ఉంది. మొత్తానికి స్వచ్చందంగా ఇచ్చిన వారు, బలవంతంగా లాక్కున్న వారూ కలుపుకుంటే 33 వేల ఎకరాల భూములు వచ్చాయి. వాటిని నవ నగరాలుగా నిర్మించాలంటే ఎన్ని తరాలు పడుతుందన్న లెక్క, అంచనా ఎవరికీ లేకపోవడమే అసలైన రాజకీయ మాయ.రాజధాని విషయంలో జరుగుతున్న రాజకీయంలో తొలి ముద్దాయి చంద్రబాబేనని తోటి రాజకీయ పక్షాలు కూడా నిందిస్తున్నాయి. సీపీఐ నారాయణ లాంటి వారు అయితే చంద్రబాబుకు అసలు తలకాయ ఉందా అని పరుషమైన మాట అనేశారు. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అని కూడా ఆయన ప్రశ్నించారు. వెయ్యో, రెండు వేల ఎకరాలు తీసుకుని రాజధాని అభివ్రుధ్ధి చేసి ఉండాల్సిందని కూడా ఆయన అంటూ చంద్రబాబుని ఎత్తిచూపారు. అదే విధంగా ఆందోళన చేస్తున్న రైతులు సైతం చంద్రబాబునే నిలదీయాలి మరి. ఆయన ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు కూడా గట్టిగా గుర్తుచేయాల్సిందే మరి. కానీ చంద్రబాబుని దగ్గర కూర్చోబెట్టుకుని కొత్త ప్రభుత్వాన్ని తిడితే ఉన్న కొమ్మను నరుక్కున్నట్లే అన్న మాట వినిపిస్తోంది.దీని మీదనే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక సలహా రైతులకు ఇచ్చారు. బాబుని పక్కన పెట్టుకుని ఆందోళన చేస్తే రైతుల సమస్యలు తీరవని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రైతుల విష‌యంలో ఇప్పటిదాకా మోసం చేసింది చంద్రబాబే అని ఆయన అంటూ చంద్రబాబు ని నిలదీయాల్సిన రైతులు తమ ప్రభుత్వాన్ని తిడితే ఎలా అంటున్నారు. దీని అర్ధం ఏంటంటే ఎంతలా చంద్రబాబు ను దగ్గరకు తీసుకుంటే అంతలా రైతులకు మేలు కంటే కీడే జరుగుతుందని.మరి ఈ సంగతి గ్రహించకుండా రైతులు ప్రతిపక్షాలతో అంటకాగితే సమస్య పరిష్కారం కాకపోగా మరింతగా రాజుకుంటుంది. సీఎం జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే అమలు చేయడమే ఇప్పటివరకూ అంతా చూశారు, ఇపుడు కూడా ఆయన అమరావతి రైతులకు అన్యాయం చేయరని వైసీపీ నేతలు అంటున్నారు. అందువల్ల రైతుల ప్రతినిధులు ప్రభుత్వంతోనే తమ బాధలు చెప్పుకోవడం మంచిదని సూచనలు వస్తున్నాయి. దానికంటే ముందు అమరావతిలోనే అన్నీ పెట్టాలన్న మొండి డిమాండ్లను వదులుకుంటే మంచిదన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి రైతులు ఎలా స్పందిస్తారో.

Related Posts